సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (22:34 IST)

ఆంజనేయుడికి శ్రీకృష్ణుడు వెన్న ఇచ్చిన కారణం ఏంటి? (video)

Hanuman
వాయుభగవానుడి పుత్రుడు ఆంజనేయ స్వామిని శనివారం పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. బుధ, గురు, శనివారాలతో పాటు పండగ నెల మొత్తం ఆరాధించడం చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేగాకుండా శ్రీరాముడిని పూజించడం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందవచ్చు. 
 
రావణాసురుడి వధించిన తర్వాత దేవరులకు ఇబ్బంది కలిగించిన ఇద్దరు రాక్షసులను సంహరించేందుకు ఆంజనేయుడిని దేవతలు ఎంచుకున్నారు. ఆ ఇద్దరు రాక్షసులతో పోరుకు గాను దేవతలందరూ తమ శక్తులకు చిహ్నంగా, ఆశీర్వాదంగా ఆయుధాలను అందజేశారు. ఈ క్రమంలో శ్రీరాముడు విల్లును, బ్రహ్మదేవుడు, పరమశివుడు.. ఇతర దేవతలందరూ ఆయుధాలను ఆయనకు ప్రసాదంగా అందజేశారు. 
 
అయితే శ్రీకృష్ణుడు వెన్నను అందజేశాడు. ఈ వెన్న కరిగేలోపు తలపెట్టిన యుద్ధంలో కార్యోన్ముఖుడవవుతావని అనుగ్రహిస్తాడు. దీని ప్రకారం హనుమంతుడు శ్రీకృష్ణ ప్రసాదమైన వెన్న కరిగేలోపు.. ఇద్దరు రాక్షసులను సంహరించాడు. 
 
అందుకు హనుమ పూజలో వెన్నకు ప్రత్యేక స్థానముంది. హనుమకు వెన్నతో అలంకరణ చేసి పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.