శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 15 జులై 2020 (14:38 IST)

ఆ పండ్లు కలలో అగుపిస్తే ప్రేయసీప్రియులకు... (video)

నిద్రలో మనలో చాలామందికి కలలు వస్తుంటాయి. ఈ కలలో ఒక్కో దానికి ఒక్కో అర్థం వుంటుందని జ్యోతిష నిపుణులు చెపుతుంటారు. అలాంటి వాటిలో కొన్నింటి గురించి చూద్దాం. ఆపిల్‌పండు కలలో కనిపించిన ప్రేయసీ ప్రియులకు ఎడబాటు తప్పదు. ఎక్కువగా ఆపిల్స్ కనిపించిన విందులు వినోదాలతో కాలక్షేపము చేయగలరు.
 
రేగు పండు కలలో కనిపించిన ధనవంతులలో స్నేహ సంబంధము ఏర్పడగలవు. నారింజపండు తిన్నట్లు కలవచ్చిన త్వరలో వివాహం జరుగును. ద్రాక్ష తోటలో తిరుగుతున్నట్లు కలవచ్చిన ప్రేమ వ్యవహారములు ఫలించవు. ద్రాక్షరసం త్రాగినట్లు కలవచ్చిన అనారోగ్యము కలుగును. ఎండుద్రాక్ష తిన్నట్లు కలవచ్చిన అధిక ధన వ్యయము కలుగును.