శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

గురువారం శ్రీరామ తారక మంత్రాన్ని స్తుతిస్తే..?

మహావిష్ణువు అలంకార ప్రియుడు. మహా శివుడు అభిషేక ప్రియుడు. హనుమంతుడు స్తోత్ర ప్రియుడు. అందుకే ''శ్రీ రామ జయ రామ.. జయ జయ రామ'' అనే స్తోత్రాన్ని పఠిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. ఈ రామ మంత్రాన్ని స్తుతిస్తే హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. రోజూ 21 సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తే.. హనుమాన్‌ను ప్రార్థిస్తే శుభాలు చేకూరుతాయి. 
 
పంచముఖ హనుమాన్‌ను గురువారం పూజించడం ద్వారా కుటుంబ సౌఖ్యం చేకూరుతుంది. సుదీర్ఘ చర్మ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. జ్యోతి స్వరూపుడైన హనుమంతుడిని గురువారం రోజున పూజ చేస్తే.. కుటుంబీకుల మధ్య ఐక్యత చేకూరుతాయి. గురువారం రోజున హనుమంతుడిని పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 
 
ఆంజనేయ స్వామి పూజ, వ్రతాన్ని మంగళ, గురు, శనివారాల్లో చేపడితే.. మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. గురువారం హనుమాన్ చాలీసాను పఠించడం చేస్తే భోగభాగ్యాలు చేకూరుతాయి. అదేరోజున రామచరిత చదవడం చేయాలి. ఇంకా హనుమంతుని ప్రీతికరమైన రామనామాన్ని పారాయణాన్ని స్తుతించడం ద్వారా అప్పుల బాధలు తొలగిపోతాయి.  
 
తమలపాకు మాల ఎందుకు?
అశోక వనంలో హనుమంతుడు సీతాదేవిని చూసి శ్రీరాముడిని గురించిన వివరాలు తెలిపారు. రాముని చూడామణిని ఇచ్చి తిరిగి వెళ్తారు. ఆ సమయంలో రాముని గురించి తెలిపిన హనుమంతుడిని సీతను ఆశీర్వదిస్తుంది. ఆ సమయంలో పక్కనున్న తమలపాకు తీగను తుంచి.. పుష్పాల్లా చల్లి ఆశీర్వదించింది. అలా తమలపాకులతో సీతమ్మ ఆశీర్వదించడంతోనే తమలపాకులు ఆయనకు ప్రీతికరం అయ్యాయి. అందుకే హనుమంతుడిని తమలపాకుతో పూజించడం చేస్తే.. మాలను సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.