1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: గురువారం, 29 డిశెంబరు 2016 (22:03 IST)

2017లో మీనరాశి వారి ఫలితాలు ఇలా ఉంటాయి....

మీన రాశివారికి ఆగస్టు వరకు షష్టమము నందు రాహువు వ్యయము నందు కేతువు, ఆ తదుపరి అంతా పంచమము నందు రాహువు, లాభము నుందు కేతువు, సెప్టెంబర్ 12వ తేదీ వరకు సప్తమము నందు బృహస్పతి ఆ తదుపరి అంతా అష్టమము నందు, జూన్ నెల వరకు రాజ్యము నందు శని, ఆ తదుపరి వక్రగతిన అక్ట

మీన రాశి : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1,2,3,4 పాదాలు
ఆదాయం 8, వ్యయం 11, పూజ్యత 6, అవమానం 3
 
మీన రాశివారికి ఆగస్టు వరకు షష్టమము నందు రాహువు వ్యయము నందు కేతువు, ఆ తదుపరి అంతా పంచమము నందు రాహువు, లాభము నుందు కేతువు, సెప్టెంబర్ 12వ తేదీ వరకు సప్తమము నందు బృహస్పతి ఆ తదుపరి అంతా అష్టమము నందు, జూన్ నెల వరకు రాజ్యము నందు శని, ఆ తదుపరి వక్రగతిన అక్టోబరు వరకు భాగ్యము నందు, ఆ తదుపరి అంతా రాజ్యము నందు సంచరిస్తాడు. 
 
మీ గోచారం పరీక్షించగా "విశ్వాస రహితం శూన్యం ఫలితం"
 
అనే సత్యాన్ని గ్రహించి ఆత్మవిశ్వాసంతో శ్రమించండి, ఆదాయానికి మించి ఖర్చులు అధికం. అదనపు ఆదాయం కోసం మరింత శ్రమించవలసి ఉంటుంది. కుటుంబీకుల పట్ల బాధ్యతలు అధికమవుతాయి. అప్పుడప్పుడు ఆరోగ్యం సమస్యలు తలెత్తుతాయి. సెప్టెంబరు నుండి అష్టమ గురుదోషం ఏర్పడుతున్నందువల్ల ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఒక వార్త మీకెంతో ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. చిన్నతరహా, వృత్తి వ్యాపారులకు శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ప్రభుత్వ రంగాల్లో వారికి పైఅధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. జీవితభాగస్వామి విషయంలో కొంత అసంతృప్తి ఎదుర్కొనక తప్పదు. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి, కాంట్రాక్టర్లకు కలిసి వచ్చేకాలం. శుభకార్యాల్లో విందు, వినోదాల్లో పాల్గొంటారు. 
 
విద్యార్థుల లక్ష్య సాధనకు మరింత కృషి అవసరం. వివాదాలకు విలైనంత దూరంగా ఉండటం మంచిది. వ్యవసాయ రంగాల్లో వారికి వాతావరణం అనుకూలించకపోవడం, నకిలీ విత్తనాలు వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. దూర ప్రయాణాలు దైవదర్శనాలు అనుకూలిస్తాయి. స్త్రీలు ఆరోగ్యంలో అధికమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. సభలు, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుణదాతల నుండి ఒత్తిడి అధికం అవుతుంది. పీచు, నార, ఫోం లెదర్ వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. కోర్టు వ్యవహారాల్లో న్యాయవాదుల తీరు మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. గృహనిర్మాణాల విషయంలో కొంతజాప్యం ఎదుర్కొనతప్పదు. కళా, క్రీడా, రంగాల్లో వారు పట్టుదలతో ముందుకుసాగుతారు. 
 
ప్రైవేటు సంస్థల్లో అధికారుల తీరుతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. పాత మిత్రుల కలయికమీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పోస్టల్, బీమా రంగాల్లో వారు నూతన పద్ధతులు అవలంభించి ముందుకు సాగుతారు. సంగీత, సాహిత్య, కళాకారులకు అనుకోని గుర్తింపు, రాణింపు లభిస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వారు విన్నూత ప్రయోగాల ద్వారా దేశఖ్యాతిని వ్యాపింపజేస్తారు. పండితులకు, పౌరహితులకు, శాస్త్ర రంగాల్లో వారికి శుభదాయకం. ఈ రాశి విద్యార్థుల దక్షిణామూర్తి, శారదాదేవిని ఆరాధించడం వల్ల స్థిరబుద్ధి, విద్యాభివృద్ధి చేకూరుతుంది. 
 
ఈ రాశివారు 'వేంకటేశ్వర సుప్రభాతం' చదవటం వల్ల లేక వినడం వల్ల శుభం కలుగుతుంది. 'ఇష్టకామేశ్వరి దేవత'ను పూజించిన అభీష్టం సిద్ధిస్తుంది. పూర్వాభాద్ర నక్షత్రం వారు 'కనకపుష్యరాగం', ఉత్తరాభాద్ర నక్షత్రం వారు 'పుష్యనీలం', రేవతి నక్షత్రం వారు 'గరుడపచ్చ' ధరించిన శుభం కలుగుతుంది. 
 
పూర్వాభాద్ర నక్షత్రం వారు 'మామిడి' చెట్టును, ఉత్తరాభాద్ర వారు 'వేప' చెట్టును, రేవతి  నక్షత్రం వారు 'విప్ప' చెట్టును నాటిన పురోభివృద్ధి పొందుతారు.