లక్ష్మీ కుబేర పూజ ఎప్పుడు చేయాలి.. ఉసిరిని దానం చేస్తే?
గురువారం రోజున వచ్చే పౌర్ణమి తిథిలో లక్ష్మీ కుబేర పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి రోజున చంద్రుని కాంతి పూర్తిగా పడే ప్రాంతంలో శుభ్రం చేసి.. రంగ వల్లికలతో తీర్చిదిద్ధి.. అరటి ఆకును వేసి అందులో ముఖం చూసే అద్దాన్ని వుంచాలి.
ఇంకా మల్లెపువ్వులు పేర్చి.. ఆవు పాలు, పండ్లు, పనీర్ వుంచి చంద్రుని హోర, గురు హోర, బుధ హోర, శుక్ర హోర కుబేరునికి పూజ చేయడం శుభాలను ఇస్తుంది. ఇది ధనలాభాన్ని పెంచుతుంది. పౌర్ణమి వెలుగులో లక్ష్మీ కుబేర పూజ చేయడం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
అలాగే అమావాస్య, అక్షయ తృతీయ రోజున కుబేర పూజ చేయడం మంచిది. ఈ పూజ చేసిన అనంతరం అన్నదానం చేయడం ఉత్తమం. ఇంకా ఉసిరికాయలను దానం చేయడం ఈతిబాధలను తొలగిస్తాయి.
ఉసిరికాయను దానం పొందడం ద్వారానే ఓ పేద మహిళ ధనవంతురాలైంది. ఇలా ఆది శంకరుని నోట కనకధారా స్తోత్రంను లోకానికి ప్రసాదించారు.. ఆది శంకరులు.