సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : సోమవారం, 6 ఆగస్టు 2018 (17:57 IST)

పాము కలలో కనిపిస్తుందా..? పాము గొంతుకు చుట్టినట్లు కలగంటే..?

అప్పుడప్పుడు పాము కలలో కనిపిస్తుందా..? అయితే ఇలా చేయండి అంటున్నారు.. ఆధ్యాత్మిక నిపుణులు. కొంతమందికి పాములు కలలో కనిపిస్తూనే వుంటాయి. ఇందుకు కారణం రాహు, కేతు దశలు. లేకుంటే రాహు బుద్ధి, కేతు బుద్ధి కాల

అప్పుడప్పుడు పాము కలలో కనిపిస్తుందా..? అయితే ఇలా చేయండి అంటున్నారు.. ఆధ్యాత్మిక నిపుణులు. కొంతమందికి పాములు కలలో కనిపిస్తూనే వుంటాయి. ఇందుకు కారణం రాహు, కేతు దశలు. లేకుంటే రాహు బుద్ధి, కేతు బుద్ధి కాలంగా వుంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిని బట్టి పాము కలలో కనిపించేందుకు.. జ్యోతిష్యానికి తప్పక లింకుందని వారు చెప్తున్నారు. 
 
పాము కలలో వస్తే ఒకందుకు మంచిదే. రాహు-కేతు గ్రహాలకు పరిహారం చేసేందుకే పాములు అలా కలలో కనిపిస్తాయట. నాగుపామును కలలో చూస్తే.. విరోధులతో ఇబ్బందులు వస్తాయని గమనించాలి. రెండు తలలతో కూడిన నాగుపాము కలలో కనిపిస్తే.. మంచి ఫలితాలుంటాయి. 
 
ఇకపోతే.. పామును చంపేస్తున్నట్లు కలగంటే.. శత్రుబాధలు తొలగిపోతాయి. నాగుపాము కరిచినట్లు కలవస్తే ధనలాభం వుంటుంది. పాము తరుముతున్నట్లు కలగంటే.. దారిద్ర్యం తప్పదు. పాము కాలికి చుట్టుకున్నట్లు కలవస్తే.. శని పట్టిపీడించబోతున్నాడని గ్రహించాలి. పాము కరిచి రక్తం వచ్చినట్లు కలగంటే.. పట్టిన శని వీడినట్లు గుర్తించాలి. పాము గొంతుకు చుట్టినట్లు కలగంటే.. ఆస్తిపరులు అవుతారని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.