శనిదోషాల నివారణకు ఇలా చేస్తే..?
చాలామంది శనిదోషాలతో బాధపడుతుంటారు. ఈ దోషాలను తొలగించుకోవడానికి ఎన్నెన్నో ఆలయాలకు వెళ్ళి పూజలు చేస్తుంటారు. అయినా కూడా ఈ శనిదోషాల నుండి విముక్తి లభించలేదు.
చాలామంది శనిదోషాలతో బాధపడుతుంటారు. ఈ దోషాలను తొలగించుకోవడానికి ఎన్నెన్నో ఆలయాలకు వెళ్ళి పూజలు చేస్తుంటారు. అయినా కూడా ఈ శనిదోషాల నుండి విముక్తి లభించలేదు. అందుకు ఈ నామాన్ని స్మరిస్తే దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
''శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ''
అనే మంత్రాన్ని జపిస్తే కొంతవరకైన దోషాలు నివారించవచ్చని పురాణాలలో చెబుతున్నారు. అలానే విజయదశమి నాడు సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం తరువాత జమ్మిచెట్టు వద్దగల అపరాజితాదేవిని ఆరాధించి పైన చెప్పిన శ్లోకాన్ని జపిస్తూ జమ్మిచెట్టును ప్రదక్షణలు చేయాలి. ఈ శ్లోకాన్ని కాగితాలలో రాసుకుని జమ్మిచెట్టు కొమ్మలకు తగిలించాలి.
దశమి నాడు ఇలా చేయడం వలన కోరిక వరాలు, కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. దాంతో శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. శ్రీరామ చంద్రుడు, విజయదశమి, విజయ కాలము నందు ఈ శమీ పూజను చేసి లంకపై జైత్రయాత్రను మెుదలుపెట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీని వలనే హిందూవులందరు దీనిని విజయ ముహూర్తంగా భావిస్తారు.