గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 18 అక్టోబరు 2019 (21:16 IST)

బిడ్డకు ఏ నెలలో దంతములు అగుపిస్తే ఏంటి ఫలితం?

శిశువు జన్మించిన మాసం లోపుగానే దంతములు కనబడితే ఆ శిశువుకే హాని కలుగుతుంది. రెండో మాసంలో కనబడితే కనిష్టభ్రాతృ హాని. మూడో నెలలో అగుపిస్తే అక్కకు కీడు కలుగుతుంది. నాల్గవ నెలలో అయితే తల్లికి హాని జరుగుతుంది. 
 
ఐదవ నెలలో అయితే జ్యేష్ఠ భ్రాతృహాని. ఆరో నెలలు దంతములు వస్తే సౌఖ్యము. ఏడో నెలలో అయితే తండ్రి వలన సుఖము కలుగుతుంది. ఎనిమిదవ నెలలో అయితే పుష్టి, 9వ నెలలో అయితే ఐశ్వర్యము. పది, పదకొండు మాసాలలో అగుపిస్తే సౌఖ్యము ప్రాప్తిస్తుంది. 12వ మాసంలో దంతములు వస్తే ధనప్రాప్తి కలుగుతుంది.