బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (12:51 IST)

ఇందిరా ఏకాదశి - 21 సార్లు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తే.. జాతక దోషాలు..?

Lord Vishnu
భాద్రపద మాసంలో ఇందిరా ఏకాదశి తిథి వస్తుంది. ఈ ఏకాదశి సెప్టెంబర్ 27వ తేదీన వస్తోంది. సెప్టెంబర్ 27 శుక్రవారం మధ్యాహ్నం 01:20 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 28 శనివారం మధ్యాహ్నం 02:49 గంటలకు ముగుస్తుంది. 
 
ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. దేవుడికి పసుపు పూలు సమర్పించండి. పసుపు విష్ణువుకు ప్రీతికరమైనది. ఇందిరా ఏకాదశి వృత్తాంతాన్ని పఠించి, విష్ణుమూర్తికి హారతి ఇవ్వండి. ఇందిరా ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన భక్తులకు పుణ్యం దక్కడమే కాదు విష్ణువు అనుగ్రహాన్ని పొందుతారు. 
 
ఎవరి జాతకంలోనైనా గ్రహ దోషం ఉంటే ఇందిరా ఏకాదశి రోజున విష్ణువు ముందు కూర్చుని 21 సార్లు నవ గ్రహ స్తోత్రాన్ని చదివితే సరిపోతుంది. ఇలా చేస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా ఈ రోజున పేదలకు దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.