గురువారం, 2 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (18:53 IST)

పూజ గదిని శుక్రవారం శుభ్రం చేస్తున్నారా? (video)

Puja room
పూజ గదిని శుక్రవారం శుభ్రం చేస్తున్నారా? అయితే ఈ కథనం చదవండి. పూజగదిలోని దీపాలను.. పూజకు ఉపయోగించే వస్తువులను శుక్రవారం పూట శుభ్రపరచడం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. శుక్రవారం పూట పూజ సామాగ్రిని శుభ్రం చేస్తే కుబేర అనుగ్రహం లభించదని.. కాబట్టి ఆది, గురువారం మరియు శనివారాల్లో మాత్రమే శుభ్రం చేయాలని వారు అంటున్నారు. 
 
ఆదివారం పూట పూజగదిని శుభ్రం చేయడం, దీపాలను శుభ్రపరచడం ద్వారా పూజ చేయడం ద్వారా కంటికి సంబంధించిన దోషాలు, రుగ్మతలు తొలగిపోతాయి. గురువారం పూట పూజ సామాగ్రిని శుభ్రం చేసి.. పూజ చేయడం ద్వారా గురుభగవానుడిని అనుగ్రహం లభిస్తుంది. శనివారం పూట పూజతో వాహన ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. 
 
ఇకపోతే.. దీపాలను వెలిగించని దేవాలయాల్లో దూది వత్తులతో దీపం వెలిగిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. పంచముఖ దీపంలో ముగ్గురమ్మలు కొలువై వుంటారు. కామాక్షి దీపం కూడా ముగ్గురమ్మల స్వరూపమని.. అలాంటి దీపాలను శుక్రవారం శుభ్రపరచటం చేయకూడదు. 
 
సోమవారం అర్థరాత్రి నుంచి బుధవారం అర్థరాత్రి వరకు కుబేర ధన ద్రాక్షాయణి మరియు గుహ గురు ద్రాక్షాయణి దీపాల్లో కొలువై వుంటారట. అందుకే ఆ రోజుల్లో పూజ సామాన్లను శుభ్రం చేయకుండా... గురు, శుక్ర, ఆదివారాల్లో ఆ పని చేయాలని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.