Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కన్యారాశి వారి లక్షణాలు ఇలా వుంటాయి

సోమవారం, 13 నవంబరు 2017 (13:02 IST)

Widgets Magazine

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తర రెండు, మూడు, నాలుగు పాదాలు,  హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులు కన్యారాశి కిందకు వస్తారు. ఈ రాశికి బుధుడు అధిపతి. ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్‌తో కలిగి వుంటారు. సిస్టమాటిక్‌గా వుంటారు. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని చూస్తారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన చేకూరుతుంది. ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యారాశి జాతకులు.. ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా గౌరవమిస్తారు. 
 
అయితే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు సమాచారం అందుతుంది. కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేకసార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ కార్యాన్నీ మొదలెట్టరు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు.. వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు. అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతారు. గౌరవం, మర్యాద కోసం పాటుపడతారు. ఇతరులు చిన్నమాటన్నా పడరు. వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువే. ఇతరుల తప్పును సులభంగా ఎత్తిచూపే ఈ జాతకులు తమ తప్పులను గుర్తించినా.. వాటిని సరిదిద్దుకోలేరు. 
 
ఇక మహిళలైతే.. భాగస్వామ్యులను తమ చేతుల్లో పెట్టుకునేందుకు శ్రమిస్తారు. ఆ విషయంలో సక్సెస్ అవుతారు. సమాజంలోనూ ఈ రాశి మహిళలు పురుషులకంటే ముందుంటారు. మహిళలు స్నేహితులు, బంధువులకు సన్నిహితంగా వుంటారు. ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరినీ వ్యతిరేకించరు. పరిస్థితులకు తగినట్లు తమను తాము మార్చుకునే సత్తా వీరికుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

శుభోదయం : సోమవారం రాశిఫలాలు.. స్త్రీలు పంతాలకు పోరాదు...

మేషం: ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. కుటుంబీకులతో ఉల్లాసంగా ...

news

శుభోదయం : ఆదివారం నాటి రాశిఫలాలు.. దానధర్మాలు చేస్తారు...

మేషం: ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. వేడుకల్లో ...

news

12-11-2017 నుంచి 18-11-2017 వరకు మీ వార రాశి ఫలితాలు

కర్కాటకంలో రాహువు, కన్యలో కుజుడు, తులలో రవి, శుక్ర గురువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో ...

news

శుభోదయం : శనివారం దినఫలాలు .. అవకాశాలు వెతుక్కుంటూ

మేషం : బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. విద్యార్థులు బజారు ...

Widgets Magazine