మంగళవారం గవ్వలను లక్ష్మీదేవి ముందు వుంచి పూజిస్తే..?

Godess Lakshmi
సెల్వి| Last Updated: సోమవారం, 18 జనవరి 2021 (22:44 IST)
Godess Lakshmi
పూర్వం అమృతం కోసం రాక్షసులు, దేవతలు సాగర మధనం చేస్తున్నప్పుడు సముద్ర గర్భం నుంచి లక్ష్మీ దేవి, కల్పవృక్షం, కామదేనువు వంటివి ఉద్భవిస్తాయి. గవ్వలు కూడా సముద్రంలో ఉంటాయి కాబట్టి గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దీని మూలం గానే పూజ గదిలో ఉంచుకొని పూజ చేయడం ద్వారా లక్ష్మి దేవత కొలువై ఉంటుందట.

ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరని వారు గవ్వలను జేబులో పెట్టుకోవటం వల్ల పెళ్లి ఘడియలు దగ్గర పడతాయి. నల్లటి దారంలో ఈ గవ్వను వేసుకొని మెడలో కట్టుకోవడం ద్వారా ఎటువంటి నరదృష్టి తగలదని అంటారు. వ్యాపారాలు చేసేవారు తెల్లటి వస్త్రము లో ఉంచి డబ్బులు పెట్టే చోట గవ్వలను పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది.

అలాగే పురాతన కాలం నుంచి దీపావళి రోజున గవ్వలను ఆడటం ఆనవాయితీగా పాటించడం జరుగుతోంది. అయితే పసుపు రంగులో ఉండే గవ్వలను పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. గవ్వలు లక్ష్మీదేవి చెల్లెల్లు అని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు. గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబందం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలుకూడ ఉంటాయి. శివుని జటాజూటంలోను, శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి.

గృహా నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు. కొత్తగా ఇళ్ళు గృహాప్రవేశం చేసే వారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి. అలా చేయటం
వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే. గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది. గవ్వల గలలలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉన్నట్లేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :