గురువారం, 28 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (12:15 IST)

సిరిసంపదలను ప్రసాదించే లక్ష్మీ కుబేర మంత్రం.. ఎలా పఠించాలి?

సిరిసంపదలకు అధిపతి శ్రీ మహాలక్ష్మీదేవి. సిరిసంపదలకు కాపలాదారుడు కుబేరుడు. వీరిద్దరినీ కలిపి పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. కోల్పోయిన అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సంపదను కోరుతూ లక్ష్మీ కుబేర పూజ చేయడం అన్ని విధాలా శ్రేష్ఠం. 
 
"ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమః'' అనే మంత్రాన్ని రోజూ 108 లేదా 1008 సార్లు ఉచ్చరించడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. కుబేరుని దిశగా పేర్కొనబడుతున్న ఉత్తర దిశను చూస్తున్నట్లు కూర్చుని పైన చెప్పబడిన మంత్రాన్ని స్తుతించాలి. 
 
కుబేరుడిని స్తుతించేటప్పుడు కుబేర యంత్రాన్ని వుంచి పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. కుబేర యంత్రానికి నాలుగు మూలలా పసుపు, కుంకుమ, చందనం వుంచి పువ్వులతో ప్రార్థించాలి. ఆపై కుబేర గాయత్రీ మంత్రాన్ని 108 లేదా 1008 సార్లు పఠించాలి. తద్వారా ధనాదాయం వుంటుంది.