శుక్రవారం, జనవరి 10 చంద్రగ్రహణం, ఆ రాశి వారిపై తీవ్రం, 4 రాశులపై ప్రభావం
2019 ఏడాది చివరిలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. కొత్త సంవత్సరం 2020లో అడుగు పెట్టగానే మరో గ్రహణం అడుగు పెట్టబోతోంది. జనవరి 10వ తేదీ శుక్రవారం నాడు రాత్రి 10.37 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై అర్థరాత్రి 2 గంటల 42 నిమిషాల వరకూ సాగుతుంది.
ఈ గ్రహణం మిధున రాశిలో ఏర్పడుతుంది కనుక ఆ రాశి వారు గ్రహణాన్ని చూడకుండా వుంటే మంచిది. పైగా ఈ రాశి వారిపైన గ్రహణం ప్రభావం తీవ్రంగా వుంటుంది జ్యోతిష నిపుణులు చెపుతున్నారు. మొత్తం 4 గంటల పాటు సాగే ఈ చంద్రగ్రహణం మన దేశంతో పాటు ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలలో దర్శనమివ్వనుంది.
ఇకపోతే ఈ గ్రహణం యొక్క ప్రభావం మిధున రాశిపైన తీవ్రంగా వుంటుందని పైన చెప్పడం జరిగింది. మిగిలిన 11 రాశుల వారి విషయంలో ఎలా వుంటుందో చూద్దాం. కర్కాటకం, సింహ, తుల, మకర రాశులపైన కూడా ప్రభావం వుంటుంది. మేషం, కన్య, వృశ్చిక, మీన రాశుల వారికి శుభం. తుల, వృషభ, ధనుస్సు, కుంభ రాశులవారికి మధ్యమ ఫలితం వుంటుంది.