మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (18:11 IST)

01-07-2020 నుంచి 31-07-2020 వరకు మీ మాస దినఫలాలు

మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. 
ఆదాయం సంతృప్తికరం. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యవహారానుకూలత ఉంది. సంప్రదింపులతో తీరిక ఉండదు. శుభకార్య యత్నాలు సాగిస్తారు. ధనప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. గృహమార్పు కలిసివస్తుంది. సంతానం చదువులపై దృష్టిపెడతారు. ప్రకటనలు విశ్వసించవద్దు. నగదు, పత్రాలు జాగ్రత్త. వ్యాపకాలు అధికమవుతాయి. పదవులు దక్కకపోవచ్చు. ప్రత్యర్థులతో జాగ్రత్త. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఉపాధ్యాయులకు స్థానంచలనం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఆత్మీయుల క్షేమ సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
ఈ మాసం శుభశుభాల మిశ్రమం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. మనోధైర్యంతో వ్యవహరించండి. ఆర్థికంగా బాగున్నా వెలితిగా ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. పొదుపునకు అవకాశం లేదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. పరిచయాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. వ్యవహారాల్లో మెలకువ వహించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారాల్లో లాభనష్టాలు బేరీజువేసుకుంటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వుసు 1, 2, 3 పాదాలు. 
అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలు లౌక్యంగా వ్యవహరించండి. సాధ్యాంకాని హామీలు ఇవ్వొద్దు. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పనులు సానుకూలమవుతాయి. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో మెలకువ వహించండి. అపరిచితులతో జాగ్రత్త. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రమేయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయపాలన ప్రధానం. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. దైవకార్యంలో పాల్గొంటారు. సజావుగా సాగుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. 
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ధార్మిక సంస్థలకు సాయం అందిస్తారు. ఆర్థిక లావాదేవీలు పురోగతిన సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తరు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. వ్యవహారాలతో తీరిక ఉండదు. మొహమ్మాటాలు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలు, నష్టాలను అధికమిస్తారు. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానం చలనం ఆందోళన కలిగిస్తుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
ఈ మాసం అనుకూలతలు అంతంత మాత్రమే. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. బంధు మిత్రులతో విభేదిస్తారు. ఏ విషయాన్ని తెగేవరకు లాగవద్దు. కార్యసిద్ధికి ఓర్పు, పట్టుదల ప్రధానం. ఆశావహదృక్పథంతో వ్యవహరించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అయినవారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. వ్యాపకాలు సృష్టించుకోండి. అతిగా ఆలోచించవద్దు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. హోదా మార్పు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హిస్త, చిత్త 1, 2 పాదాలు. 
వ్యవహారాలతో తీరిక ఉండదు. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు ప్రయోజనకరం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పెట్టుబడులకు సమయం కాదు. పదవులు దక్కకపోవచ్చు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహమార్పు అనివార్యం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్ద మొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. న్యాయ, సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మానసికంగా కుదుటపడతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. పత్రాలు విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట. 
లక్ష్య సాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. విమర్శలు పట్టుదలను పెంచుతాయి. యత్నాలకు సన్నిహతుల ప్రోత్సాహం ఉంది. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలెదురవుతాయి. అవసరాలు వాయిదావేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వొద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం విషయంలో శుభపరణామాలున్నాయి. ప్రభుత్వ కార్యాల్లో పనులు సానుకూలమవుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం. దైవకార్యంలో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సంప్రదింపులతో తీరిక ఉండదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆత్మీయులు చక్కని సలహాలిస్తారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థల మార్పు కలిసివస్తుంది. అధికారులకు హోదా మార్పు. స్థానచలనం. విద్యార్థులకు దూకుడు తగదు. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
సంతోషకరమైన వార్తలు వింటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఆప్తుల సాయం అందిస్తారు. రావలసిన ధనం అందుతుంది. పెట్టుబడులపై దృష్టిపెడతారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. శుభాకార్య యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాభద్ర 1, 2, 3 పాదాలు. 
అన్ని రంగాల వారికి శుభదాయకమే. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతగా విశ్వసించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. విద్యార్థులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. 
ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆత్మీయులను విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. లావాదేవీలతో తీరిక ఉండదు. పనులు చురుకుగా సాగుతాయి. కష్టం ఫలిస్తుంది. ప్రతికూలతలను అధికమిస్తారు. ధనలాభం ఉంది. రుణ బాధతలు తొలగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు పదవీయోగం, స్థానచలనం. రవాణా రంగాల వారికి ఆశాజనకం. దైవ కార్యంలో పాల్గొంటారు.