నాగ పంచమి రోజున పాలును నైవేద్యంగా సమర్పిస్తే..?
నాగ పంచమి అనేది పాముల ఆరాధనకు అంకితమైన పండుగ. నాగ పంచమి ఆగస్ట్ 9, శుక్రవారం నాడు ఆచరిస్తారు. శ్రావణంలోని అమావాస్య తర్వాత ఐదవ రోజున లేదా కొన్ని ప్రాంతాలలో ఆషాఢంలో పౌర్ణమి తర్వాత జరుపుకునే నాగ పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
మానసా దేవి అష్టాంగ పూజ అని కూడా పిలుస్తారు. ఇందులో ఎనిమిది నాగులు (సర్పాలు)తో పాటు సర్ప దేవత అయిన మానసా దేవిని పూజిస్తారు. పాలును నైవేద్యంగా సమర్పించడం ద్వారా పుణ్యఫలం లభిస్తుంది.
నాగ పంచమి రోజున ఒక జత వెండి నాగు పాము ప్రతిమలను బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల సంపదలు, ధాన్యాలు పెరుగుతాయి.