ఆదివారం, 3 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (09:23 IST)

నవరాత్రులలో మహాష్టమి.. దుర్గాష్టమి రోజున ఇలా చేస్తే?

durga maata
ఆది పరాశక్తి అవతారమైన దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన సందర్భంగా దుర్గాష్టమిని నిర్వహిస్తారు.  శక్తి స్వరూపమైన అమ్మవారు దుర్గాష్టమి రోజున భక్తులకు పూజలు అందుకుంటుంది. 
 
అష్టమి తిథిలో స్త్రీ, పురుషులు ఇద్దరూ ఆ రోజు ఉపవాసముంటారు. బియ్యం, కాయధాన్యాలు, గోధుమలను ఏ రూపంలోనైనా ఉపవాసం రోజు మాత్రం భుజించకూడదు. 
 
అందువల్ల ప్రజలు వ్రతం రోజు పండ్లు, పాలను ఆహారంగా తీసుకుంటారు. అంతేకాకుండా ఆరోజు వేకువ జామునే నిద్రలేస్తారు. అనంతరం ధ్యానం చేసి దుర్గాదేవిని ప్రార్థిస్తారు. ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండే చమురు దీపాన్ని వెలిగిస్తారు. దీన్ని అఖండ జ్యోతి అని పిలుస్తారు. 
 
దుర్గమ్మ ఆశీర్వాదం కోసం అమ్మవారి కథ లేదా దుర్గా సప్తశతిని పఠిస్తూ ఆ రోజు గడుపుతారు. కొంతమంది చిన్నారులు కూడా అమ్మవారికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ పూజను కుమారి పూజ అని అంటారు.
 
నవరాత్రులలో మహాష్టమి వ్రతం అక్టోబర్ 3న నిర్వహిస్తారు. నవరాత్రుల అష్టమి తేదీ 2 అక్టోబర్ 2022 సాయంత్రం 06.47 నుండి ప్రారంభమవుతుంది, ఇది అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం 04:37 గంటలకు జరుగుతుంది.
 
అక్టోబరు 3వ తేదీన విజయవాడలో కనకదుర్గ తల్లి దుర్గాదేవి అలంకారంలో కన్పిస్తారు. ఈరోజు ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. నైవేద్యంగా కదంబం, శాకాన్నం పెడతారు.