Widgets Magazine

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 11-10-17

బుధవారం, 11 అక్టోబరు 2017 (05:44 IST)

daily astro

మేషం: రాజకీయ నాయకులు తరచు సభాసమావేశాలల్లో పాల్గొంటారు. గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డాక్టర్లు  శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
 
వృషభం: ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. మీ ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రముఖులతో కీలకమైన వ్యవహరాలు చర్చలు జరుపుతారు.
 
మిథునం: స్త్రీలకు, కళ్ళు, తల నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. వితండవాదం, భేషజాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా దూరంగా ఉండటం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాల్లో మెళకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
కర్కాటకం: వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక వ్యవహారాలతో హడావుడిగా వుంటారు. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అవకాశం కలిసివస్తుంది. విదేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకింగ్ రంగాలవారికి పనిభారం అధికమవుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు.
 
సింహం: దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. రావలసిన ధనం వాయిదా పడుతుంది. ఆటో మొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం. విదేశీయాన యత్నాలు చురుకుగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కన్య: పెద్దల ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత, మెళకువ వహించండి. రిప్రజెంటివ్‌లకు, ప్రైవేట్ సంస్థల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తుల్లో వారికి, చిన్నతరహా పరిశ్రమల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. రావలసిన ధనం అందకపోవటంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. స్త్రీలకు ఏ పని యందు ధ్యాస వుండదు.
 
తుల: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. గృహంలో స్వల్ప మార్పులు, మరమ్మతులు చేపడతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడటం వలన మాటపడవలసి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది.
 
వృశ్చికం: మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. వ్యాపారాల విస్తరణకు కావలసిన అనుమతులు, వనరులు సమకూర్చుకుంటారు. మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. మధ్య మధ్య ఔషధ సేవ తప్పదు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ప్రముఖులతో పరిచయాలు అధికమవుతాయి.
 
ధనస్సు : రాజకీయ నాయకులు అధికారుల ఇంటర్వ్యూల కోసం పడిగాపులు తప్పవు. ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు సంతృప్తి కానవస్తుంది. దైవదర్శనాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. అందివచ్చిన అవకాశం చేజారినా మంచికేనని భావించండి.
 
మకరం: కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. స్నేహ బంధాలు అధికం అవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబీకులతో ఆనందంగా గడుపుతారు.
 
కుంభం: ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాలను గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
 
మీనం : పీచు, ఫోం, లెదర్, ఫర్నీచర్ వ్యాపారులకు కలిసిరాగలదు. పత్రికా సిబ్బందికి ఒత్తిడి పనిభారం అధికమవుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి. అధికారిక పర్యటనలు. యూనియన్ వ్యవహారాల్లో క్షణం తీరిక ఉండదు. స్త్రీలలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. అల్లర్లు, ఆందోళనలకు విద్యార్థులు దూరంగా ఉంచాలి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

ఉదయం పక్క పైనుంచి నిద్ర లేచి ఇలా నడిస్తే ఎన్నో లాభాలు...

భారతీయ వాస్తు శాస్త్రాలకు ఓ ప్రత్యేక ఉంది. ఈ శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలు, సూచనలు ...

news

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 10-10-17

మేషం : కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదాపడుతున్న పనులు పునఃప్రారంభంకాగలవు. అకాల భోజనం, ...

news

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 09-10-17

మేషం: వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రతి విషయంలోను మీదే పైచేయిగా ఉంటుంది. మీ సంతానం ...

news

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 08-10-17

మేషం : ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలలో మాటపడాల్సి ...

Widgets Magazine