ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2017 (07:18 IST)

శుభోదయం : రాశిఫలితాలు 28-10-2017

మేషం: అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు చికాకులను ఎదుర్కొంటారు. పారిశ్రామిక రంగాల వారికి ఆటంకాలు ఎదుర్కో

మేషం: అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు చికాకులను ఎదుర్కొంటారు. పారిశ్రామిక రంగాల వారికి ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి.
 
వృషభం : విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ధైర్యంతో ముందడుగు వేస్తే తప్ప అది ఆనందదాయకం కాదు. మిత్రులతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి మంచిది. రవాణా రంగంలో వారు చికాకులను ఎదుర్కొంటారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు, పనియందు ధ్యాస ముఖ్యం.
 
మిథునం: పండ్ల, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలం. దైవ సేవా ర్యామీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా వ్యవహరించండి. ఎంతో కొంత పొదుపు చేద్దామనుకున్న మీ ఆశ నెరవేరదు. విదేశాలు వెళ్ళటానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిస్తేజానికి లోనవుతారు.
 
కర్కాటకం: వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెతుత్తాయి. స్త్రీలు బంధువుల కోసం షాపింగ్ చేస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
సింహం: బంధు మిత్రులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేసేటప్పుడు పునరాలోచన చాలా అవసరం. వృత్తుల్లో వారికి టెక్నికల్ రంగాల్లో వారికి అధిక ఒత్తిడి, చికాకు తప్పదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. విద్యార్థులకు దూకుడుతనం అధికమవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కన్య: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. బ్యాంకు లావాదేవీలు, రుణప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. చిన్నతరహా పరిశ్రమల్లో వారికి ఒత్తిడి తప్పదు. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. పెద్దల ఆహార, ఆరోగ్య విషయాల్లో మెలకువ అవసరం. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది.
 
తుల: హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబీకులతో ఆనందంగా గడుపుతారు. స్త్రీలు ఉత్సాహాన్ని అదుపులో వుంచుకోవడం శ్రేయస్కరం. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
వృశ్చికం: విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. కళా రంగాల పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. బంధువులలో మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు.
 
ధనస్సు: దాన ధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కళ, సాంస్కృతిక, క్రీడా రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. రాజకీయనాయకులకు ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులకు లోనవుతారు. మీ సంతానం గురించి ఆందోళన చెందుతారు. పై అధికారులు, ప్రముఖులతో వాగ్వివాదాలకు దిగకండి.
 
మకరం: కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం కాగలవు. మీడియా రంగాల వారికి పనిభారం అధికం. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. విద్యార్థులు స్వయంకృషితో రాణిస్తారు. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
కుంభం: ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఊహించని ఖర్చు వల్ల చేబదుళ్ళు తప్పవు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
మీనం: ప్రయాణాలు, వ్యూహాల అమలులో జాగ్రత్త అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ధనం బాగా అందడం వలన ఏ కొంతైనా నిల్వచేయగలుగుతారు. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లతీరు ఆందోళన కలిగిస్తుంది.