గురువారం, 28 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 22 మే 2018 (13:40 IST)

కోరిన కన్యను పెళ్లాడాలనుకునే పురుషులు ఇలా చేస్తే...

ముక్కంటికి అభిషేకం, పుష్పాలతో పూజ అంటే మహాప్రీతి. అడవుల్లో పూచిన పూలంటే పరమేశ్వరుడికి అమితమైన ఇష్టం. శివునికి సమర్పించే ఏ పువ్వుకైనా తొడిమ తప్పక ఉండాలి. కోరిన కన్యను పెళ్లాడాలనుకునే పురుషులు సన్నజాజి పువ్వులతో పరమేశ్వరునికి అర్చన చేయించాలి. అలాగే ఈశ్

ముక్కంటికి అభిషేకం, పుష్పాలతో పూజ అంటే మహాప్రీతి. అడవుల్లో పూచిన పూలంటే పరమేశ్వరుడికి అమితమైన ఇష్టం. శివునికి సమర్పించే ఏ పువ్వుకైనా తొడిమ తప్పక ఉండాలి. కోరిన కన్యను పెళ్లాడాలనుకునే పురుషులు సన్నజాజి పువ్వులతో పరమేశ్వరునికి అర్చన చేయించాలి. అలాగే ఈశ్వరునికి మల్లెలను సమర్పించే పురుషులకు మనస్సుకు నచ్చిన ప్రియురాలే జీవిత భాగస్వామి అవుతుందని పురోగహితులు అంటున్నారు. 
 
అలాగే మాసములను అనుసరించి శివపూజ చేసే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయి. ఈ క్రమంలో వంటిపూట భోజనంచేసి ఎవరైతే శివుణ్ణి తెల్లగన్నేరు పువ్వులతో పూజిస్తారో ఆ భక్తులకు వేయి గోదానాలు చేసిన ఫలం కల్గుతుంది. ఆషాఢంలో తెలుపురంగు కలువలతో శివుని పూజిస్తే ధృడమండలానికి చేరుతారు. బాధ్రపదంలో ఉత్తరేణిపువ్వులతో శివుని సంతుష్టినిగావిస్తే శ్రీహరిపాదాలవద్ద శాశ్వత నివాసం లభిస్తుంది. ఆశ్వీయుజంలో జిల్లేడు పుష్పాలతో శివుని ఆరాధిస్తే ఇంద్రలోక ప్రాప్తం చేకూరుతుంది. కార్తీకంలో జాజిపువ్వులతో శివుని అలంకరించితే శాశ్వత కైలాసం కలుగుతుంది. 
 
ఉమ్మెత్తపువ్వులతోనూ శివుని పూజిస్తే వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. ఫాల్గుణంలో శివుని తుమ్మిపూలతో అర్చించితే ఇంద్రుని అర్థ సింహాసనం లభిస్తుంది.  శంకరుడిని దర్భపూలతో పూజిస్తే స్వర్ణ లాభం కలుగుతుంది. ముక్కంటిని తెల్లని మందారాలతో అర్చిస్తే అశ్వమేధం చేసిన ఫలం దక్కుతుంది. ఈశ్వరుని తామరపూలతో పూజించినట్లైతే పరమపదగతి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు. 
 
ఇకపోతే జిల్లేడు పూలతో రోజుకు పది బంగారు కాసులదానం చేసిన ఫలం దక్కుతుంది. అలాగే నల్లకలువపూలతో శివుని పూజిస్తే శివసాయుజ్యం లభిస్తుంది. గన్నేరుపూలు శివునకు ఏ సమయంలోనైనా సమర్పించవచ్చు. మల్లెలను రాత్రిపూట, జాజిపూలను మూడోవజాము నందు ఈశ్వరునికి సమర్పించడం మంచిది. 
 
అలాగే పరమేశ్వరునికి పొగడపూల అర్చన చేస్తే కోరిన వరాలు నెరవేరుతాయి. ఇంకా గన్నేరు ధనమును, జిల్లేడు సంపదను, ఉమ్మెత్త మోక్షమును, నల్లకలువ సుఖమును, ఎర్రతామరలు రాజ్యమును, తెల్లతామరలు చక్రవర్తి పదవిని, సంపెంగ, జాజి సమస్త కోరికలను, తెల్లజిల్లేడు మంత్రసిద్ధిని, గులాబీలు లాభమును, దర్భపూలు ఆరోగ్యమునిస్తుందని పురోహితులు చెబుతున్నారు.