శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శుక్రవారం, 29 డిశెంబరు 2017 (22:17 IST)

2018లో మీన రాశి వారి ఫలితాలు...

మీన రాశి: పూర్వభాద్ర 4వ పాదం (ట), ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు (దూ,ఞ, ఝ,థా) రేవతీ 1, 2, 3, 4 పాదములు (దే, దో, చా, చి). ఆదాయం-5, వ్యయం-5, పూజ్యత-3, అవమానం-1 ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా పంచమము నందు రాహువు, లాభము నందు కేతువు, అక్టోబరు 11వ తేదీ వరకు

మీన రాశి: పూర్వభాద్ర 4వ పాదం (ట), ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు (దూ,ఞ, ఝ,థా) రేవతీ 1, 2, 3, 4 పాదములు (దే, దో, చా, చి). ఆదాయం-5, వ్యయం-5, పూజ్యత-3, అవమానం-1
 
ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా పంచమము నందు రాహువు, లాభము నందు కేతువు, అక్టోబరు 11వ తేదీ వరకు అష్టమ బృహస్పతి, ఆ తదుపరి అంతా భాగ్యము నందు, ఈ సంవత్సరం అంతా రాజ్యము నందు శని సంచరిస్తారు. 
 
మీ గోచారం పరీక్షించగా, 'వాక్ భూషణం, భూషణం' అన్నట్లుగా మంచి మాట, తీరును అలవాటు చేసుకోండి. 'అష్టమ గురుదోషం' ఉన్నందువల్ల కొంతమంది మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ధి పొందడానికి యత్నిస్తారు. వ్యాఖ్యలు, విమర్శలు ఆలోచింపజేస్తాయి. ఎదుటివారి ఆదాయాల గురించి అధికంగా ఆలోచిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. రాహు, కేతు, శని సంచారం అనుకూలంగానే ఉన్నది. అయితే, అక్టోబరు 11వ తేదీ వరకు గురువు వ్యతిరేక ఫలితములను ఆ తదుపరి అనుకూలముగాను సంచరిస్తాయి. 
 
దశమి శని కొన్ని అవరోధములను, కొన్ని లాభములను ఇస్తుంది. అయితే, ప్రతి పని బాగా ఆలోచించి చేయడం చాలా ఉత్తమం. కుటుంబీకులు, స్నేహితుల సహాయ సహకారాలు మీకు అందుతాయి. అయితే, కొంత ఒత్తిడి, ఆందోళన వంటివి ఎదుర్కొన్నప్పటికీ కుటుంబ అవసరాలు సకాలంలో పూర్తి అవుతాయి. భవిష్యత్ ప్రణాళికలు కొంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి. సంతాన విషయాల్లో పురోగతి కానవస్తుంది. అయితే సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. స్వవిషయాలను ఇతరుల వద్ద ప్రస్తావించకుండా ఉండటం మంచిది. ఆరోగ్య విషయాల్లో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆర్థికపరంగా ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. రాబడికి తగ్గ ఖర్చులు ఉంటాయి. 
 
నిర్మాణ పనుల్లో కొంత జాప్యం ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు, పనివారికి మధ్య ఏకీభావం కుదరదు. అవివాహితులు తమ ఇష్టానుసారం వివాహం అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కొంటారు. ఆందోళన కలిగించే సంఘటనలెదురవుతాయి. అయితే, సమయస్ఫూర్తి, పట్టుదలతో వాటిని అధికమించగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి ఉంటుంది. పాత సమస్య ఒక కొలిక్కి రాగలదు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. ఆడిట్, అకౌంట్ రంగాల్లో వారికి పనివారితో చికాకులు సమస్యలు ఎదుర్కొంటారు. 
 
విలాసవస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థుల మంచి మార్గంలో పయనించి అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. నిరుద్యోగుల యత్నాలు ఫలించి అనుకున్న లక్ష్యాలను చేరుకోగలగుతారు. వృత్తి వ్యాపారాలు ఈ సంవత్సరం అంతా నష్టాలు రాకుండా తగు జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం మంచిది. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. మొదలెట్టిన యత్నాలు విరమించుకోవద్దు. రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు అనువైనకాలం. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. 
 
గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. కళా, క్రీడా రంగాల్లో వారికి తమ ప్రతిభకు తగిన గుర్తింపు గౌరవం లభిస్తాయి. నూతన వ్యాపారాల్లో ఉన్నవారికి పనులు వాయిదాపడతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో ఉన్నవారికి పనులు వాయిదా పడతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. రైతుల శ్రమాధిక్యత ఉన్నప్పటికీ లాభాలు బాగుంటాయి. షేర్ మార్కెటింగ్ రంగాల్లో వారికి లాభదాయకంగా ఉండగలదు. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి నెలకొంటుంది. భాగస్వామిక వ్యవహారాల్లో మెళకువ అవసరం. 
 
ఈ రాశివారు అన్నపూర్ణాష్టకం చదవటం వల్ల దోషాలు తొలగిపోతాయి. నెలకు ఒక గురువారం నాడు కిలోపావు బియ్యం, కిలోపావు శెనగలు బ్రహ్మణునికి దానం ఇచ్చిన దోషాలు తొలగిపోతాయి. 
 
పూర్వాభాద్ర నక్షత్రం వారు కనకపుష్యరాగం, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు పుష్యనీలం, రేవతి నక్షత్రంవారు గరుడపచ్చ ధరించిన శుభం కలుగుతుంది. 
 
పూర్వాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును, ఉత్తరాభాద్ర వారు వేప చెట్టును, రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును నాటిన పురోభివృద్ధి పొందుతారు.