శని ప్రదోషం.. మహా ప్రదోషం.. బిల్వపత్రాలు, గరిక సమర్పిస్తే..?
శని ప్రదోషాన్ని మహా ప్రదోషం అంటారు. ప్రదోషం, ముఖ్యంగా శనివారం వస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. సర్వపాపాలను పోగొట్టే శని ప్రదోష రోజున శివాలయానికి తప్పక వెళ్లాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
ఈ రోజున శివునికి అభిషేకం.. నందీశ్వరునికి అభిషేకం చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇలా చేస్తే మన పాపాలన్నీ పటాపంచలవుతాయి.
శనివారం నాడు వచ్చే ప్రదోష నాడు ఉపవాసం ఉండి శివుని దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయి. ఈరోజు శివుడు, నందిదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అభిషేక సేవలు జరుగుతాయి.
16 రకాల అభిషేక వస్తువులతో అభిషేకం జరుపుతారు. పాలు, పెరుగు, చందనం, తేనె వంటి పదార్థాలతో స్వామికి అభిషేకం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున సాయంత్రం 4.30 నుండి 6 గంటల మధ్య ప్రదోష సమయంలో ఇంట్లో దీపం వెలిగించి శివుని పూజించండి.
నమశ్శివాయ పంచాక్షరీతో ఆయన్ని పూజించాలి. వీలైతే ఆలయంలో రుద్రాభిషేకం చేయించవచ్చు. నందీశ్వరునికి ఈశ్వరునికి బిల్వపత్రాలు, గరిక సమర్పించవచ్చు. శని ప్రదోష పూజ జీవితంలో జీవితంలో శ్రేయస్సు, మార్పును తెస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.