శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (14:47 IST)

భాద్రపద శనివారం.. పిండి దీపాన్ని ఉదయం 5.30 గంటలకు వెలిగిస్తే..?

venkateswara swamy
భాద్రపద శనివారం.. పిండి దీపాన్ని ఉదయం 5.30 గంటలకు వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. అప్పుల బాధలు వుండని, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని ఆధ్యాత్మి పండితులు అంటున్నారు. 
 
తిరుపతిలో భాద్రపద మాసంలో బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతాయి. అలాంటి భాద్రపద మాసంలో వచ్చే శనివారం శ్రీవారిని పూజించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి.
 
భాద్రపద శనివారం ఉపవాసం ఉండే వారు ముందుగా ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసి రంగవల్లికలతో పూజగదిని అలంకరించుకోవాలి. తర్వాత శ్రీనివాసుని చిత్రం ముందు పంచదీపాన్ని వెలిగించాలి. పసుపు రంగు పుష్పాలు, చక్కెర పొంగలి, గారెలు, నువ్వుల అన్నం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. 
 
భాద్రపద మాసంలో ప్రతి శనివారం దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తే శ్రీవారి అనుగ్రహం లభిస్తుంది. బియ్యప్పిండి, బెల్లం కలిపి ఆ పిండితో దీపం వెలిగించడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ దీపాన్ని నేతితో వెలిగించడం శ్రేష్టం. లేకుంటే నువ్వుల నూనెను వాడవచ్చు. 
 
పూజ అనంతరం కొబ్బరి తురుము వేసి పిండితో కలిపి అందరికీ ప్రసాదంగా ఇవ్వాలి. తులసి, తామర, కుంకుమలతో శ్రీవారిని అలంకరించుకోవడం ద్వారా సర్వాభీష్ఠాలు చేకూరుతాయి. అలాగే భాద్రపద మూడవ శనివారం ఉపవాసం ఉంటే ఇంటి ఇలవేల్పు అనుగ్రహం లభిస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది. బాధలు తొలగిపోతాయి.