మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శనివారం, 28 జులై 2018 (19:40 IST)

జూలై 29-07-2018 నుండి 03-08-2018 వరకు మీ వార రాశి ఫలితాలు(Video)

కర్కాటకంలో రవి, రాహువు, బుధులు, సింహంలో శుక్రుడు, తులలో బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో కుజ, కేతువులు. మకర, కుంభ, మీన, మేషంలో చంద్రుడు. 1న శుక్రుడు కన్య ప్రవేశం. 31న సంకటహర చతుర్ధి.

కర్కాటకంలో రవి, రాహువు, బుధులు, సింహంలో శుక్రుడు, తులలో బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో కుజ, కేతువులు. మకర, కుంభ, మీన, మేషంలో చంద్రుడు. 1న శుక్రుడు కన్య ప్రవేశం. 31న సంకటహర చతుర్ధి.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
సర్వత్రా అనుకూలతలున్నాయి. గృహమార్పు కలిసివస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆచితూచి వ్యవహరించాలి. గురు, శుక్ర వారాల్లో ఏకపక్ష నిర్ణయాలు తగవు. తప్పిదాలను సరిదిద్దుకోండి. స్వయంకృషితో రాణిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ధనం అందుతుంది. రుణ విముక్తులవుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు చురుకుగా సాగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. నగదు, వస్తువులు జాగ్రత్త. మీ ప్రేమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. కంప్యూటర్, వైద్య రంగాలవారి ఆదాయం బాగుంటుంది. ప్రయాణం తలపెడతారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. పనులు హడావుడిగా పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. తప్పిదాలను సరిదిద్దుకునేందుకు అవకాశం లభిస్తుంది. సంతానం ద్వారా శుభవార్త వింటారు. వాగ్ధాటితో రాణిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పరిస్థితులు అనుకూలత ఉంది. ప్రకటనలు ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సహాయం ఆశించవద్దు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీపై వచ్చిన అభియోగాలు తొలగోపోగలవు. ఆందోళన తొలగి కుదుటపడుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆది, సోమ వారాల్లో పనుల్లో చికాకులు అధికం. పెట్టుబడుల సమాచారమ సేకరిస్తారు. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగుకుండా మెలగాలి. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మనోధైర్యంతో ముందుకు సాగండి. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. అవసరాలు తీరుతాయి. దాంపత్యసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఎవరి సాయం ఆశించవద్దు. స్వయంకృషి పైనే ఆధారపడండి. పరిచస్తుల వాఖ్యాలు మనస్థాపం కలిగిస్తాయి. మంగళ, బుధ వారాల్లో కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. విద్యా ప్రకటనలు విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కాంట్రాక్టులు, ఏజెన్సీలకు అనుకూలం కాదు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. వృత్తుల వారికి సామాన్యం.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహ దృక్పధంతో మెలగండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దంపతుల మధ్య సఖ్యత లోపం. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. ఆది, సోమ వారాల్లో ధన సమస్యలెదురవుతాయి. ఆత్మీయుల సాయంతో కుదుడపడుతారు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పదవుల, బాధ్యతల నుండి తప్పుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు అధికారుల వైఖఱి ఇబ్బంది కలిగిస్తుంది. విదేశీ విద్యాయత్నం ఫలించదు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ప్రయాణం చికాకు పరుస్తుంది.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ధనప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఖర్చులు భారమనిపించవు. ధనం డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. వివాదాలు పరిష్కారమవుతాయి. సన్నిహితులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మంగళ, శని వారాల్లో అస్వస్థతకు గురవుతారు. అతిగా ఆలోచింపవద్దు. విశ్రాంతి అవసరం. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధనలాభం ఉంది. ఖర్చులు భారమనిపించవు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్తు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించండి. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. బంధుత్వాలు బలపడుతాయి. గురు, శుక్ర వారాల్లో అనేక పనులతో సతమతమవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి రాగల్గుతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు అధికమవుతాయి. నిరుద్యోగులు కృషి ఫలిస్తుంది. వృత్తుల వారికి సామాన్యం. వివాదాలు సద్దుమణుగుతాయి. సమావేశాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు దూకుడు తగదు. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఆర్థికంగా కుదుటపడుతారు. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. పనుల వేగవంతమవుతాయి. పరిస్థితుల అనుకూలత ఉంది. చేజారిన అవకాశాలను దక్కించుకుంటారు. అపరిచితులతో జాగ్రత్త. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. శనివారం నాడు ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
మనోధైర్యంతో ముందుకు సాగండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పరిస్థితుల క్రమంగా చక్కబడుతాయి. ఆందోళన తొలగతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు అడుగువద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. వ్యవహార ఒప్పందాలకు  అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. చిరువ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగుల సాయంతో కుదుటపడుతారు. పెద్దమెుత్తం నగదుతో ప్రయాణం తగదు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. నగదు, వస్తువులు జాగ్రత్త. ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్యలు సద్దుమణుగుతాయి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లెదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమెుత్తం సాయం తగదు. గృహమార్పు అనివార్యం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. నిరుద్యోగుల కృషి అందుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడుతాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. ఆలోచనలు పలు విధాలుగు ఉంటాయి. ఖర్చులు విపరీతం. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. మీ శ్రీమతి వైఖరి అసహానం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించండి. ఆది, సోమ వారాల్లో కొత్త సమస్యలెదురవుతాయి. పెద్దల సలహా పాటించండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం. పురస్కారాలు అందుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
శుభకార్య యత్నం ఫలిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు సద్దుమణుగుతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. మంగళ, బుధ వారాల్లో మీ జోక్యం అనివార్యం. స్థిరాస్తి కొనుగోలుపై దృష్టి పెడతారు. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. చిరువ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వీడియో చూడండి...