1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (19:05 IST)

శనిదోషం తగ్గిపోవాలంటే.. రావిచెట్టు కింద దీపమెలిగించి..?

శనిదోషం కారణంగా ఇబ్బందులు తప్పవు. ఆ ఇబ్బందులు, ఈతిబాధల నుంచి తప్పించుకోవాలంటే.. రావిచెట్టు కింద దీపం వెలిగించడం ఉత్తమం. ప్రతి శనివారం సాయంత్రం రావిచెట్టుకింద దీపం వెలిగించడం వలన కూడా శనిదోష ప్రభావం తగ్గుతుందని చెప్పబడుతోంది.
 
దేవతా వృక్షంగా రావిచెట్టు ఆలయ ప్రాంగణంలో పూజలు అందుకుంటూ ఉంటుంది. శనివారం సాయంత్రం వేళలో దైవదర్శనం చేసుకుని రావిచెట్టు కింద దీపం వెలిగించడం ద్వారా శనిదోష ప్రభావం తగ్గుతుంది. శని సంబంధమైన దోషంతో బాధపడుతోన్న వాళ్లు రావిచెట్టు కింద దీపం వెలిగించడం వలన మంచి ఫలితం కనిపిస్తుందని పంచాంగ నిపుణులు అంటున్నారు.