1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 15 మే 2015 (18:00 IST)

వృషభరాశి జాతకులు ఎలాంటి డ్రెస్స్‌లు వేసుకుంటారంటే?

వృషభరాశి జాతకులు ఎలాంటి డ్రెస్ కోడ్ వేసుకుంటారంటే..? ఈ రాశి వారి ఫ్యాషన్ కొంచెం భిన్నంగా వుంటుంది. సాధారణ డ్రెస్‌లతోనే ప్రత్యేకంగా కనపడాలనుకుంటారు. కళ్ళు చెదిరే డ్రెస్‌లు కాక తనకోసం, తనకు తగినరీతిలో రూపొందించబడిన డ్రెస్‌లను ధరిస్తారు.
 
ముఖ్యమైన ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడూ ఈ పద్ధతిలోనే వస్తారు. వీరికి బిగుతు దుస్తులు నచ్చవు. వదులు వుండేవే ధరిస్తారు. తనలోని సెక్స్ అప్పీల్‌ దాచుకోవాలనుకుంటారే కాని డ్రెస్ ద్వారా బయటపెట్టాలని అనుకోరు. తేలికపాటి రంగులు, ఎంబ్రాయిడరీ చేసిన డ్రెస్‌లు, అల్లికలు, లతలు కలిగినవి ధరిస్తారు.