మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (20:10 IST)

మార్చి 31న సంకష్టహర చతుర్థి.. వినాయకుడి పూజ... ఫలితాలు

Vinayaka
వినాయకుడిని సంకష్టహర చతుర్థి రోజున పూజ చేయడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. వినాయక స్వామిని పూజించేందుకు పలు వ్రతాలున్నా.. సంకష్టహర చతుర్థినాడు చేసే పూజలు, వ్రతాలు విశేష ఫలితాలను అందిస్తాయి. సమస్త దోషాలను, ఈతిబాధలను తొలగించగలిగే మహిమాన్వితమైనది.. సంకష్ట హర చతుర్థి వ్రతం. ఈ వ్రతం ఆచరించడం ద్వారా సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. 
 
పౌర్ణమికి తర్వాత వచ్చే నాలుగో రోజున సంకష్ట చతుర్థి వ్రతమాచరించి.. వినాయకుడికి అభిషేకాదులు చేసినట్లైతే సర్వం శుభం చేకూరుతుంది. ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి రోజున ఆలయాల్లో జరిదే విఘ్నేశ్వర పూజలో పాల్గొంటే కుటుంబంలో సంతోషం వెల్లి విరుస్తుంది. విఘ్నాలు తొలగిపోతాయి. శుభకార్యాలు చేకూరుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. 
 
ఫలితాలు..
సంకష్టహర చతుర్థి వ్రతంలో రోగాలు దరిచేరవు. ఆయుర్దాయం, ఆరోగ్యం చేకూరుతుంది. జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈతిబాధలుండవు. నవగ్రహ దోషాలు, ఏలినాటి దోషాలతో ఏర్పడే ఇబ్బందులు తొలగిపోతాయి. పిల్లలకు విద్య సులభంగా అబ్బుతుంది. శనిదోషాలను నివృత్తి చేసుకోవాలనుకునే వారు ఈ వ్రతాన్ని ఆచరించడం ఉత్తమం.