శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (09:39 IST)

శనివారం పూట శ్రీవారిని, శనీశ్వరునిని ఇలా పూజిస్తే...? (video)

శనివారం వేంకటేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. అలనాడు వైష్ణవులు ఎంతో శ్రద్ధగా శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసికోట ముందు ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించినవారికి అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి. ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడు కొలువుంటుందని నమ్మకం.
 
శనివారం సాయంత్రం పూట వేంకటేశ్వర ఆలయం దర్శంచి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. 
 
అలాగే శనిపేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడు. శనివారం లేదా త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా ఏలినాటి శని ప్రసన్నుడవుతాడు. అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది
 
వారంలో ఏడవవారం శనివారం. శనివారానికి అధిపతి శనేశ్వరుడు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 'ఏడు' శనికి ప్రీతికరమయిన సంఖ్య.
 
అందుచేత శనివారం.. శని గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం వుంటుంది. ''ఓం కాకథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్. || ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||" అనే మంత్రాన్ని పఠించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.