Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సప్తముఖ రుద్రాక్ష : భాగస్వామిపై ప్రేమను పెంచుతుంది-ఏలినాటి శనిదోషాన్ని తొలగొస్తుంది

సోమవారం, 6 మార్చి 2017 (14:54 IST)

Widgets Magazine

సప్తముఖంలో ఉండే రుద్రాక్షమాలను ధరిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ రుద్రాక్షం శేష నాగ స్వరూపుముగా పూజించబడుతోంది. ఒక్కో ముఖానికి ఒక్కో సర్పంగా భావిస్తారు. వీటిని అనంత, కర్కాటక, పుండరీక, తక్షక, విశ్లభన, కరిష్ణా, శంఖచూడుడు అని పిలుస్తారు. ఇవి శక్తివంతమైన సర్పాలు. ఏడు ముఖాల రుద్రాక్షసప్తమాతృకలు, సప్తఋషులు, సూర్యునికి ప్రతీక. వీటిని ధరిస్తే లక్ష్మీకటాక్షము సిద్ధిస్తుంది.
 
కానీ పద్ధతి ప్రకారం ధరిస్తే.. జ్ఞానము, సంపద లభిస్తుంది. పాపాలు తొలగిపోతాయి. దీపావళి పర్వదినము నందు లేదా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల్లోపు, శనివారం, బ్రాహ్మీముహూర్త సమయములో దీనిని ధరించాలి. దీన్ని ధరించేముందు శ్రీ లక్ష్మీ సహస్రనామపూజ లేదా లక్ష్మీ అష్టోత్తర పూజ చేసి ధరించాలి. మాలధారణ చేసేటప్పుడు రుద్రాక్ష మంత్రమును 11మార్లు ధ్యానించవలెను. ఏలినాటి శని తొలగిపోవాలంటే.. సప్తముఖ రుద్రాక్షమాల ధరించడం ద్వారా  బాధలు నుండి విముక్తులు కాగలరు.
 
ఈ మాలధారణ చేసినవారికి సర్పకాటు భయం ఉండదు. అంతేగాక సర్పాలకు అధిపతి అయిన పరమశివుని అభయహస్తం ఉంటుంది. వశీకరణ, లైంగిక శక్తి పెరుగుతుంది. దారిద్ర్యం తొలగిపోతుంది. సంపద, పేరు, ఆధ్యాత్మిక జ్ఞానం సొంతమవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఇంకా సప్తముఖ రుద్రాక్షను ధరించడం ద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. సంపద, ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకా ప్రశాంతతను, సంతోషాన్నిస్తుంది. సప్తముఖ రుద్రాక్షను ధరించడం ద్వారా వ్యాపారం, వాణిజ్యంలో రాణిస్తారు. ఇది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఇంకా ప్రేమకు అనుకూలిస్తుంది. భాగస్వామిని ప్రేమను పెంచుతుంది. ఆర్థిక సమస్యలను దూరం చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

రెండు చేతులతో తల గోక్కుకుంటున్నారా.? నోట్లను ఎంచేటప్పుడు వేలికి ఎంగిలి తాకితే లక్ష్మీదేవి?

సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలా? లక్ష్మీదేవి మీ ఇంటనే ...

news

నెగటివ్ ఎనర్జీ.. వాస్తు దోషాల్ని తరిమి కొట్టాలా? అగరవత్తులను బేసి సంఖ్యలోనే ఎందుకు వెలిగించాలి?

ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అయితే వాస్తు దోషాలు వున్నాయని ...

news

శ్రీవారి ప్రక్కనైనాసరే వెల్లకిలా పడుకోకూడదు... ఇంకా...

సూర్యోదయం కాకుండానే నిద్ర లేవాలి. సూర్యాస్తమయం అయితేగాని నిద్రపోవాలి. గడప మీద ...

news

సుఖసంతోషాలకు, అప్పుల బాధ పోయేందుకు....

మనదేశం అనేక విశ్వాసాలపై నడుస్తుంటుంది. అందుకే కొన్ని పద్ధతులను పాటిస్తుంటారు. ...

Widgets Magazine