గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జూన్ 2022 (09:36 IST)

శనిపూజ విశిష్టత: రావిచెట్టు, వేపచెట్టుకు నీటిని సమర్పిస్తే..?

Lord Shani
శనివారం సూర్యాస్తమయం తర్వాత రావిచెట్టు దగ్గర దీపం వెలిగించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని.. శనివారం హనుమంతుడిని ఆరాధిస్తే.. శనిదోషాలుండవు. బజరంగబలి భక్తులను తాను ఎప్పుడూ వేధించనని శనిదేవుడు హనుమంతుడికి వాగ్ధానం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
శనిదోషాలు తొలగించుకోవాలంటే శనివారం పూట రావిచెట్టుకు నీటిని సమర్పించి.. చెట్టుకు ఏడుసార్లు ప్రదక్షణలు చేయాలి. పేదవారికి దానం చేయాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
జాతకంలోనైనా కుండలిలో శనిదోషం లేదా కేతు దోషం లేదా శనిదోషముంటే.. ఈ రెండు దోషాల్ని శాంతింపజేసేందుకు వేపను ఉపయోగిస్తారు.  
 
వేపను పూజిస్తే హనుమంతుడు ప్రసన్నమౌతాడని విశ్వాసం. భక్తులపై కారుణ్యం కురిపిస్తారని అంటారు. అందుకే నియమబద్ధంగా వేపచెట్టుకు నీళ్లు అర్పించాలి. 
 
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇంట్లో వేప చెట్టు తప్పకుండా ఉండాలి. ఇలా చేస్తే ఆ వ్యక్తి చుట్టూ పాజిటివ్ ఎనర్జీ అభివృద్ధి చెందుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.