సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:44 IST)

శనివారం కాకులకు అన్నం పెట్టి.. పేదలకు వస్త్రదానం చేస్తే? (video)

శనివారం పూట నువ్వుల నూనెను రాసుకుని అభ్యంగన స్నానమాచరించి.. చిన్నపాటి వస్త్రంలో నువ్వులుంచి మూటలా కట్టుకుని.. నువ్వులనూనెతో శనీశ్వరునికి దీపం వెలిగించాలి. నిష్ఠతో శని కవచం లేకుంటే శని గాయత్రి జపం చేయాలి.
 
నైవేద్యం చేసిన తర్వాత కాకికి నువ్వులు కలిపిన అన్నం పెట్టి.. ఆపై భోజనం చేయాలి. ఇలా చేస్తే ఏలినాటి శని, జన్మ శని, అర్ధాష్టమ, అష్టమ శని దోషాలు తొలిగిపోతాయి. ఇంకా శనీశ్వరుని అనుగ్రహంతో శుభఫలితాలు ఏర్పడతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
 
అలాగే శనిభగవానుడి శాంతి కోసం నవగ్రహ హోమాలు చేయించడం.. నువ్వులను శుభ్రం చేసి.. వేయించి ఏలకులు పొడి చేరి దంచుకుని తిలచూర్ణం చేసి శ్రీ వేంకటేశ్వరునికి, శనీశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి పేదలకు దానం చేస్తే శని దోషాలుండవు. ఈతిబాధలు తొలగిపోతాయి. ఇంకా ఒక్కో శనివారం ఉపవాసముండి.. కాకి అన్నం పెట్టి పేదలకు వస్త్రాలు, అన్నదానం చేస్తే శనిభగవానుడి అనుగ్రహం లభిస్తుంది. 
 
శనీశ్వరుడి అనుగ్రహం కోసం.. శనిదోషాలు తొలగిపోవాలంటే శనివారం పూట శివాలయంలోని శనీశ్వరుని చుట్టూ నువ్వులతో దీపం వెలిగించి ప్రదక్షణలు చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.