సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (17:37 IST)

ఏలినాటి-శనిదోషాలు తొలగిపోవడానికి ఇలా చేస్తే...

జీవితం ఆనందంగా సాగిపోవాలనే ప్రతిఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. బాధలు, కష్టాలు తమ దరిచేరకుండా చూడమని భగవంతుడిని ప్రార్ధిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో తమకి శనిదోషం ఉందని తెలిస్తే ఎవరైనాసరే కంగారుపడిపోతారు.

జీవితం ఆనందంగా సాగిపోవాలనే ప్రతిఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. బాధలు, కష్టాలు తమ దరిచేరకుండా చూడమని భగవంతుడిని ప్రార్ధిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో తమకి శనిదోషం ఉందని తెలిస్తే ఎవరైనాసరే కంగారుపడిపోతారు. శని ప్రతికూల ఫలితాలను గురించి వినివుండడం వలన ఎంతగానో భయపడుతూ ఉంటారు. తమకి గల శనిదోషం కారణంగా ఏ పని చేస్తే ఎలాంటి ఫలితాలొస్తాయనే సందేహం వారిలో తలెత్తుతుంటుంది.
 
దానివలన ధైర్యంగా ఏ పనైన చేసేందుకు అడుగు ముందుకు వేయలేక తీవ్రమైన ఆందోళనకు లోనవుతుంటారు. శనిదోష ప్రభావం నుండి బయటపడడానికి గల మార్గాలను అన్వేషిస్తుంటారు. ఆ మార్గాలలో ఒకటిగా సూర్యభగవానుడి ఆరాధనను చెప్పబడుతోంది. సమస్త జీవులకు ఆహారాన్ని అందించు ప్రత్యక్షనారాయణుడు సూర్యభగవానుడే కాబట్టి వేదకాలం నుండి ఆ స్వామి పూజలు అందుకుంటున్నారు. 
 
అలాంటి సూర్యభగవానుడి కొడుకే శనిదేవుడు. తన తండ్రిని పూజించేవారికి అతని కుమారుడు అనుకూలంగా ఉండడమేనేది లోకంలో సహజంగా కనిపిస్తుంది. సూర్యభగవానుడికి నమస్కరించేవారి పట్ల, అంకితభావంతో ఆరాధించేవారి పట్ల శనిదేవుడు ప్రసన్నతను కలిగి ఉంటాడని శాస్త్రంలో చెప్పబడుతోంది.

అందువలన శనిదోషం కారణంగా ఇబ్బందులు పడుతున్నవారు సూర్యభగవానుడిని పూజిస్తే శనిదోష ప్రభావాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో స్పష్టం చేయబడుతోంది.