శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జూన్ 2020 (22:01 IST)

సోమవారం ముందు వినాయకుడు.. ఆపై శివుడి పూజ చేయాలట.. (Video)

శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు మారెడు చెట్టుకు గల బిల్వ పత్ర ఆకులతో పూజిస్తే భక్తుల కోరికలన్నీ తీరుస్తారని విశ్వాసం. శివుడికి బిల్వపత్ర ఆకులతో పాటు గంధపు చెక్క, పువ్వులు, పండ్లు, నువ్వులు కూడా సమర్పించవచ్చు. అలాగే శివుడికి పూజ చేసే సమయంలో ''ఓం నమః శివాయ'' అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. 
 
శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటిపశువుగా ఉంటుంది. శివుని పుష్పాలతో పూజిస్తే, పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. ఎవరైతే కనీసం ఎనిమిది పుష్పాలతో శివుని పూజిస్తారో వారికి కైలాసప్రాప్తి కలుగుతుంది. శివపూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.
 
బిల్వపత్రాన్ని సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజులలో ఈ బిల్వ పత్రాలను చెట్టు నుంచి తీయకూడదు. ముక్క పోయిన ఆకులను పెట్టకూడదు. నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి. 
 
సోమవారం కానీ ఎప్పుడైనా శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా.. ముందుగా వినాయకుడిని పూజించాలనే స్వయంగా శివుడే వివరించాడు. తులసి ఆకులను ఎట్టిపరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.