శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (18:42 IST)

వధూవరుల నుదుటన ధరించే బాసికం ప్రాముఖ్యత ఏంటి?

వధూవరులు నుదుటన ధరించే 'బాసికం' ఓ అందమైన అలంకారంగా కనిపిస్తుంది. కానీ శాస్త్ర పరంగా చూస్తే 'బాసికం' వెనుక గల బలమైన అర్థముందు. వివాహ ఘట్టంలో అత్యంత ముఖ్యమైన సమయం 'సుముహూర్తం'. 
 
ఈ సుముహూర్త సమయంలో వధువు రెండు కనుబొమల మధ్య స్థానాన్ని అంటే బొట్టు పెట్టుకునే స్థానాన్ని వరుడు చూడాలి. అలాగే వధువు కూడా వరుడి రెండు కనుబొమల మధ్య ప్రదేశాన్ని చూడాలని అంటారు. 
 
అయితే సుముహూర్త సమయంలో ఇరువురు కూడా ఈ విషయాన్ని మరిచిపోకుండా వుండటం కోసం, ఇద్దరి దృష్టి కూడా వెంటనే ఆ స్థానం పై పడటం కోసం నుదుటన 'బాసికాలు' కడుతుంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి ఆకర్షణ పెరుగుతుందని ... తాము ఒకటేననే భావన కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.