Skanda Sashti 2022: కుమార షష్ఠి.. కార్తీకేయుడిని పూజిస్తే? (video)
ఆషాఢ మాసం, శుక్లపక్షం, ఆరవ రోజున కుమార షష్ఠి లేదా స్కంద షష్టిని జరుపుకుంటారు. కుమార స్వామితో పాటు శివుడు - పార్వతీ దేవిని కూడా ఈ రోజున పూజించారు. కార్తికేయుడిని కుమారస్వామి, సుబ్రహ్మణ్యం వంటి పేర్లతో పిలుస్తారు.
ఇక మంగళవారం నాడు కుమార షష్ఠి రావడం విశేషం. ఎందుకంటే.. మంగళవారం కుమార స్వామి పూజకు విశిష్టమైన రోజు. ఈ రోజున భక్తులు కుమార స్వామికి గంధం, కుంకుమ, ధూపం, పువ్వులు, పండ్లు సమర్పిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి.
పంచాంగం ప్రకారం, షష్టి తిథిని పంచమి తిథితో కలిపిన కాలవ్యవధిని భక్తులు ఉపవాసం పాటించడానికి ఇష్టపడతారు. అంటే పంచమి మొదటి నుంచి షష్ఠి తిథి వరకు వుంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు.
ఇకపోతే.. కుమార స్వామిని పూజించిన తర్వాత 'స్కంద షష్టి కవచం', 'సుబ్రహ్మణ్య భుజంగం' లేదా 'సుబ్రహ్మణ్య పురాణం' అని జపించడం మంచిది.
స్కంద షష్ఠి 2022: ప్రాముఖ్యత
కుమార షష్ఠి కార్తికేయుడి జయంతిని సూచిస్తుంది. రాక్షసుల అధర్మాన్ని ఓడించడానికి ఈ రోజున దేవతల సేనాధిపతిగా కుమార స్వామి అవతరించాడని నమ్ముతారు.
కుమార్ షష్ఠి జూలై 4 సాయంత్రం 6:32 గంటలకు ప్రారంభమై జూలై 5 న రాత్రి 7:28 గంటలకు ముగుస్తుంది.
స్కంద షష్టి 2022: శుభ ముహూర్తం
పవిత్రమైన అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:53 గంటల వరకు..అమృత్ కాలం ఉదయం 6:06 గంటలకు ప్రారంభమై రాత్రి 7:51 గంటలకు ముగుస్తుంది. ఇకపోతే కుమార షష్ఠి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంతానప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, దంపతుల మధ్య అన్యోన్యత, వ్యాపారాభివృద్ధి ఫలితాలుంటాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.