మామిడి ఆకుల తోరణాన్ని ఆ రోజుల్లో ఇంటి గుమ్మం ముందు కడితే..?

Last Updated: గురువారం, 10 జనవరి 2019 (18:01 IST)
మంగళవారం, శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకుల తోరణాన్ని కడితే.. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవని.. ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.


అలాగే కస్తూరి పసుపు, పచ్చ కర్పూరంను నీటిలో కలిపి, మంగళవారం, శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఇంటిలోపల, వెలుపల చల్లడం ద్వారా సానుకూల ఫలితాలు వుంటాయి. అలాగా నిమ్మ, గుమ్మడికాయతో ఇంటికి దృష్టి తీయడం చేస్తే.. ఇంట్లో దుశక్తులు ఇంటి నుంచి దూరమవుతాయి. ఇంకా శుభవార్తలు వింటారు.
 
ఇకపోతే.. ఆలయానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. పుష్పాలైనా వెంటబెట్టుకుని వెళ్లాలి. వట్టి చేతులతో ఆలయంలోకి ప్రవేశించడం కూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాలు, కుంకుమ, విభూతి, పసుపును అక్కడే విడిచిపెట్టి రావడం చేయకూడదు. ఇంటికి తెచ్చుకుని.. కుటుంబ సభ్యులకు ఇవ్వడం చేయాలి. 
 
అదేవిధంగా ఆలయాల్లో నేతి లేదా నువ్వుల నూనెతో దీపమెలిగించాలనుకునేవారు.. అగ్గిపెట్టెను వెంటపెట్టుకుని వెళ్లాలి. ఇతరులు వెలిగించిన దీపంతో నేతి దీపాన్ని, నువ్వుల నూనెతో దీపాన్ని లేదా కర్పూరాన్ని కూడా వెలిగించకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
ఆలయాల్లో గర్భగుడికి నేరుగా నిలబడి దైవదర్శనం చేయకూడదు. నందికి అడ్డంగా నిల్చుని శివ దర్శనం చేయకూడదు. గర్భగుడికి కుడి వైపు లేదా ఎడమ వైపు నిల్చుని స్వామిని దర్శించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :