శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

పెళ్లి కాని అమ్మాయిలకు సరే.. వివాహం కానీ అబ్బాయిలకు..?

పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు రుక్మిణీ కళ్యాణం.. చదివితే త్వరగా పెళ్లి అవుతుందని.. లలితా దేవిని పూజించమని, కాత్యాయనీ వ్రతమని.. ఇలా పరిష్కార మార్గాలు చెప్తారు. కానీ పెళ్లి కాని అబ్బాయిలకు ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా..? క్షీర సాగరం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని "సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం" అంటారు. 
 
ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది. కనీసం 41 రోజులు క్రమం తప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారం లేదా మంగళవారికి ఆవుపాలతో చేసిన పరమాన్నం నైవేద్యం పెట్టిన వారికి సమస్త దోషాలు తొలగిపోతాయి. ఇలా చేస్తే వివాహం ఆలస్యమవుతున్న అబ్బాయిలకు అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన కన్యతో వివాహం అవుతుంది. అలాగే లక్ష్మీదేవి లాంటి భార్య లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.