సోమవారం, 18 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (21:05 IST)

దేవాలయంలో ఈ పనులు చేస్తే.. కుంకుమ పెట్టుకోకుండా...?

దేవాలయంలో అడుగుపెట్టిన తర్వాత నిద్రపోవడం, కాళ్లు చాపుకుని కూర్చోవడం వంటి పనులను కూడా చేయరాదు. ఆలయాల్లో ఎవ్వరితోనూ.. ఎప్పటికీ వివాదం అనేదే పెట్టుకోరాదు. అలాగే దేవాలయ ప్రాంగణంలో ఏ జీవికీ హాని కలిగించడం లేదా హింసించడం వంటివి అస్సలు చేయరాదు. దేవాలయ ప్రాంగణంలో అహంకారం, గర్వంతో, అధికార దర్పంతో అస్సలు ఉండకూడదు. 
 
దేవుని ఎదుట పరస్తుతిని, పరనింద వంటి పనులను చేయరాదు. ఒకే చేతితో నమస్కారం చేయరాదు. అధికార గర్వంతో దేవాలయ ప్రాకారంలో ప్రవేశించి అకాల సేవలను చేయరాదు. ఆలయాల్లో ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాతే గుడి లోపలికి ప్రవేశించాలి. 
 
ఆలయంలో లోపలికి తలపాగా ధరించి వెళ్లకూడదు. అలాగే చేతుల్లో ఏవైనా ఆయుధాలను పెట్టుకుని అస్సలు ప్రవేశించకూడదు. ఆలయంలోకి ఒట్టి చేతులతోగాని, కుంకుమ పెట్టుకోకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూ గాని, తినుబండారాలేవైనా తింటూ గాని దేవాలయంలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.