Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

07-01-18 ఆదివారం రాశిఫలాలు : ప్రేమికుల మధ్య అనుమానాలు తొలగిపోతాయ్

ఆదివారం, 7 జనవరి 2018 (06:15 IST)

Widgets Magazine

మేషం: కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. ఖర్చులు అదుపు చేయలేరు. మరింత ధన వ్యయం అవుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. 
 
వృషభం: ప్రైవేట్ సంస్థల్లోని వారు మరో ఉద్యోగంలో చేరే విషయంలో పునరాలోచన మంచిది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. ముఖ్యమైన వ్యవహారాలను గోప్యంగా ఉంచండి.  
 
మిథునం: ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్స్‌లు మంజూరు కాగలవు. రాజకీయనాయకులకు దూర ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. 
 
కర్కాటకం: సంతానం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. బెట్టింగ్‌లు, జూదాలు, వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
సింహం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి .
 
కన్య: శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. ప్రేమికుల మధ్య అనుమానాలు తొలగిపోతాయి. దుబారా ఖర్చులు అధికమవుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెలకువ అవసరం. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. 
 
తుల : ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఇతరులతో కలసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కోళ్ల, మత్స్య, పాడి రంగాల వారికి పురోభివృద్ధి. కానివేళలో బంధువులరాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
వృశ్చికం: బెట్టింగ్‌లు, జూదాలు, వ్యసనాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. మిత్రులతో సఖ్యత కోసం ప్రయత్నిస్తారు. అనవసరపు వాగ్ధానాలు చేసి సమస్యలను తెచ్చుకోకండి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. 
 
ధనుస్సు : ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. రాజకీయాల్లోని వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. నిరుద్యోగులకు నిరంత కృషి అవసరమని గమనించండి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
మకరం : ఆర్థిక విషయాల్లో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఇతరుల తప్పిదాలకు సైతం మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. వ్యాపారాల్లో మంచి మాటలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు.  
 
కుంభం : నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు. పెద్దల సలహాను పాటించి నీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ కష్టం వృధాపోదు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. 
 
మీనం : ఉద్యోగస్తులు విశ్రాంతి చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ మాటకు సర్వత్రా మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలకు  ఆభరణాలు, విలాస వస్తువులపై మక్కువ పెరుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

మీ వార రాశి ఫలితాలు... 07-01-2018 నుంచి 13-01-2018 వరకు(వీడియో)

కర్కాటకంలో రాహువు, తులలో గురు, కుజులు, ధనుస్సులో రవి, బుధ, శుక్ర, శని, మకరంలో కేతువు. ...

news

06-01-18 శనివారం : గృహం కొనుగోలుకు యత్నిస్తారు

మేషం : వ్యాపారవర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. వైద్యులకు ...

news

5-01-2018 శుక్రవారం ... ఆలోచనలు గోప్యంగా ఉంచండి...

మేషం: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు ...

news

04-01-18 తేదీ దినఫలాలు... రుణ విముక్తులవుతారు....

మేషం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రుణ విముక్తులు ...

Widgets Magazine