శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 జూన్ 2023 (15:05 IST)

అప్పుల బాధ తీరాలంటే మహా వారాహి దేవిని పూజిస్తే..?

Varahi Puja
అప్పుల బాధ తీరాలంటే మహా వారాహి దేవిని పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్రతి వారం మంగళ, శుక్రవారాల్లో శ్రీ వారాహి దేవిని పూజించడం వల్ల అన్ని రకాల రుణాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. 
 
రుణబాధలు తొలగేందుకు, ఎంత డబ్బు సంపాదించినా ఖర్చు పెట్టే సమస్య తీరిపోవడానికి, మితిమీరిన ఖర్చులు అరికట్టేందుకు బుధవారం నాడు వారాహి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చునని విశ్వాసం. 
 
మహావిష్ణు స్వరూపం వారాహి అమ్మవారు. ఈమెకు నేతి దీపం వెలిగించి పూజిస్తే ఎన్నో లాభాలుంటాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.