రాశి వార ఫలితాలు... ఆగస్టు 13 నుంచి 19 వరకు... 14న కృష్ణాష్టమి(వీడియో)

శనివారం, 12 ఆగస్టు 2017 (19:30 IST)

మిథునంలో శుక్రుడు, కర్కాటకంలో రవి, కుజులు, సింహంలో రాహువు, వక్రి బుధులు, కన్యలో బృహస్పతి, వృశ్చికంలో వక్రి శని, కుంభంలో కేతువు. మేష, వృషభ, మిథున, కర్కాటకంలో చంద్రుడు. 13 నుంచి బుధుని వక్రమారంభం, 16న రవి సింహం నందు, 17న రాహువు కర్కాటకం నందు, కేతువు మకరం నందు ప్రవేశం. 14న కృష్ణాష్టమి. 
 
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఈ వారం ఖర్చులు అంచనాలను మించుతాయి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం. ధనం మితంగా వ్యయం చేయండి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టపడినా ఫలితం ఉండకపోవచ్చు. సంప్రదింపులు వాయిదా పడతాయి. సలహాలు, సహాయం ఆశించవద్దు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కుటుంబ విషయాలు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషపరుస్తుంది. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. కంప్యూటర్, టెక్నికల్ రంగాల వారికి ఆశాజనకం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. పెట్టుబడులు, పొదుపు పథకాలకు అనుకూలం. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు ప్రయోజనకరం. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. అవివాహితులు కొత్త అనుభూతి చెందుతారు. దైవ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు సర్దుకుంటాయి. మానసికంగా కుదుటపడతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. అవకాశాన్ని తక్షణం వినియోగించుకోండి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. ప్రియతముల కోసం బాగా వ్యయం చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. మంగళ, బుధవారాల్లో అనేక పనులతో సతమవతమవుతారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త.  బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవకార్యం, వేడుకల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. పనులు సానుకూలమవుతాయి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. గురు, శుక్రవారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనప్రాప్తి. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. లైసెన్సులు, పర్మిట్ల వ్యవహారాల్లో నిర్లక్ష్యం తగదు. సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఏమంత స్పందన ఉండదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆప్తుల సాయం అందుతుంది. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. వ్యాపారులకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. చిరువ్యాపారులకు ఆశాజకనకం. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. సహోద్యోగులతో జాగ్రత్త. మీ మాటలు చేరే వేసే వ్యక్తులున్నారని గమనించండి. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి. దైవకార్యంలో పాల్గొంటారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయులు, చిన్నారులకు కానుకలందిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆది, సోమవారాల్లో పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు కొత్త బాధ్యతలు, ఒత్తిడి, విశ్రాంతి లోపం. సహోద్యోగులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. పెద్దమొత్తం నగదుతో ప్రయాణం తగదు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. అవసరాలు, కోరికలు నెరవేరుతాయి. పనుల సానుకూలతకు పట్టుదలతో శ్రమించాలి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. పలుకుబడి, పరిచయాలు విస్తరిస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆచితూచి వ్యవహరించండి. మంగళ, బుధవారాల్లో మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. మార్కెట్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ధనలాభం, పదోన్నతి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్ సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అంచనాలు, ఊహలు ఫలిస్తాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ధనానికి ఇబ్బంది ఉండదు. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఆది, గురువారాల్లో భేషజాలు మొహమ్మాటాలకు పోవద్దు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం దగదు. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది. విదేశీ విద్యాయత్నంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రకటనలు, బోగస్ సంస్థలను నమ్మవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాల నుంచి బయటపడతారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
విమర్శలు, అభియోగాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆదాయం అంతంత మాత్రమే. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. యత్నాలు ఫలించక నిరుత్సాహం చెందుతారు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కీలక పత్రాలు, నోటీసులు అందుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. మంగళ, శనివారాల్లో పనుల ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగుల సాయం అందుతుంది. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆశాదృక్పథంతో యత్నాలు సాగించండి. గృహమార్పు అనివార్యం. ఇతురల విషయాల్లో జోక్యం తగదు. వ్యవహారాల్లో సొంత నిర్ణయం తీసుకోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. గురు, శుక్రవారాల్లో శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. లౌక్యంగా వ్యవహరించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులకు ఉన్నత  విద్యావకాశం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర, 1, 2, 3 పాదాలు 
సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. పరిచయం లేని వారితో మితంగా సంభాషించండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. శుభకార్యంలో పాల్గొంటారు. మీరాక బంధుమిత్రులను సంతోషపరుస్తుంది. శనివారం నాడు వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పట్టుదలతో శ్రమించినట్లైతే పనులు పూర్తవుతాయి. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. కంప్యూటర్, సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయుల శ్రమ ఫలిస్తుంది. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. సాధ్యం కాని హామీలు ఇవ్వొద్దు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండియ ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఏజెన్సీలు, టెండర్లు దక్కించుకుంటారు. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. హోల్ సేల్  వ్యాపారులు, స్టాకిస్టులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వేడుకల్లో పాల్గొంటారు. పందాలు, జూదాల జోలికి పోవద్దు.దీనిపై మరింత చదవండి :  
August 13 Krishnastami Rashi Phalalu Weekly Astro Weekly Horoscope

Loading comments ...

భవిష్యవాణి

news

శుభోదయం... మీ రాశి ఫలితాలు 12-08-2017

మేషం : ఈ రోజు ఉద్యోగస్తులు తోటివారిని ఓ కంట కనిపెట్టడం మంచిది. నిరుద్యోగులకు లభించిన ...

news

శుభోదయం : మీ రాశి ఫలితాలు (11-08-2017)

మేషం : ఈరోజు ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు ...

news

శుభోదయం... ఈ రోజు రాశి ఫలితాలు 10-08-2017

మేషం : ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. రావలసిన ఆదాయం అందుతుంది. ఖర్చులు అధికం, ...

news

ఎరుపు బట్టలో రాళ్ళ ఉప్పును వుంచి ప్రధాన ద్వారానికి కడితే?

ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించే శక్తి రాళ్ల ఉప్పుకు ఉంది. ప్రతికూల ప్రభావం, స్వభావం ...