సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (17:12 IST)

సెప్టెంబరు 23 నుంచి 29వ తేదీ వరకు మీ వార రాశి ఫలితాలు

స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటుతనం వలన నష్టాలు, ఇబ్బందులు తప్పవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం ద్వారా శుభవార్త వింటారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. లక్ష్యస

కర్యాటకంలో రాహువు, కన్యలో రవి, బుధులు, తులలో గురు, శుక్రులు, ధనస్సులో శని, మకరంలో కుజ, కేతువులు, కుంభ, మీన, మేష, వృషభంలో చంద్రుడు. 23న అనంత వ్రతం. 27న ఉండ్రాళ్ల తద్ది, 28న సంకటహర చతుర్థి.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటుతనం వలన నష్టాలు, ఇబ్బందులు తప్పవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం ద్వారా శుభవార్త వింటారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. లక్ష్యసాధనకు ఓర్పు నేర్పు ప్రధానం. సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. మంగళ, బుధ వారాల్లో పట్టుదలతో వ్యవహరించండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. వృత్తుల వారికి జన సంబంధాలు బలపడుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఏది జరిగినా మంచికేనని భావించండి. బంధువులు మీ చిత్తశుద్ధిని ఆలస్యంగా గుర్తిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. గురు, శుక్ర వారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు చిరువ్యాపారులకు ఆశాజనకం. సరుకు నిల్వలో జాగ్రత్త. విదేశీ విద్యాయత్నం ఫలించదు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలను అన్వేషిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. శనివారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. పెట్టుబడులకు సమయంకాదు. గుట్టుగా యత్నాలు సాగించండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఆశించిన పదవులు దక్కవు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను అధిగమిస్తారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పెట్టుబడులు, పొదుపు పథకాలు అనుకూలం. వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు చేజిక్కించుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆది, సోమ వారాల్లోల హామీలివ్వవద్దు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. గృహమార్పు వలన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు నిరుత్సాహం అధికం. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం.  
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. దైవ, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను నమ్మవద్దు. మంగళ, బుధ వారాల్లో స్వల్ప అస్వస్థతకు గురవుతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ సలహా ఎదుటివారికి ఉపకరిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తొలగి కుదుటపడుతారు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. అధికారులకు ఒత్తిడి, పనిభారం. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. వాహన చోదకులకు దూకుడు తగదు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. వేడుకలు, శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థికలావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆది, సోమ వారాల్లో మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యతలోపం. పంతాలు, పట్టుదలకు పోవద్దు. సామర్యసంగా వివాదాలు పరిష్కరించుకోవాలి. ఆప్తుల కలయికతో కుదుటపడుతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు సామాన్యంగా సాగుతాయి. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మంగళ, శని వారాల్లో కొందరి వ్యాఖ్యాలు ఉద్రేకపరుస్తాయి. సహనం కోల్పోవద్దు. స్థిమితంగా ఉండడానికి యత్నించండి. సమస్యలు నిదానంగా సర్దుకుంటాయి. చిన్నచూపు చూసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఖర్చులు సామాన్యం. ధనానికి లోటుండదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. ఆధ్యాత్మికం పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారులకు ఆశాజనకం. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. ఆచితూచి వ్యవహరించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. చాకచక్యంగా పనులు పూర్తి చేసుకోవాలి. గురు, శుక్ర వారాల్లో ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆర్థికంగా కుదుటపడుతారు. రుణయత్నం ఫలిస్తుంది. అవసరాలు నెరవేరుతాయి. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తరుణం కాదు. అప్రయత్నంగా అవకాశాలు కలిగివస్తాయి. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయంలో పునరాలోచన అవసరం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వృత్తుల వారికి జనసంబంధాలు బలపడుతాయి. ప్రయాణం తలపెడుతారు.  
 
ధనస్సు: మూల, పుర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
పదవుల స్వీకరణకు అనుకూలం. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. వాగ్ధాటితో రాణిస్తారు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మెుహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. శనివారం నాడు డబ్బు డ్రా చేసేటపుడు జాగ్రత్త. గృహమార్పు కలిసి వస్తుంది. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
వ్యవహారానుకూలతకు మరింత శ్రమించాలి. ఏ విషయాన్ని తేలికంగా తీసుకోవద్దు. ఆర్థికలావాదేవీలు నిరాశపరుస్తాయి. రుణ ఒత్తిడి అధికం. ఊహించన ఖర్చులతో సతమతమవుతారు. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. అవసరాలు వాయిదా పడుతాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆప్తుల కలయికతే కుదుటపడుతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. నోటీసులు, కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ అవుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కళకారులకు ప్రోత్సాహకరం.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పుర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. వాస్తవ దృక్పథంతో ఆలోచించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకునేందుకు యత్నించండి. అనవసర జోక్యం తగదు. ఖర్చులు సామాన్యం. కొంతమెుత్తం ధనం అందుతుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. అవివాహితులకు శుభవార్త శ్రవణం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విదేశీ విద్యా ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. ప్రకటనలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.  
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమెుత్తం సహాయం క్షేమం కాదు. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడండి. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. అయిన వారు మ అశక్తతను అర్థం చేసుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాకు విలువ ఇవ్వండి. ఆది, సోమ వారాల్లో అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి.