శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (21:50 IST)

#WeeklyHoroscope 14-06-2020 నుంచి 20-06-2020 వరకు మీ వార రాశి ఫలితాలు..

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
వ్యవహారానుకూలత. అనుకున్నది సాధిస్తారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పొదుపు ధనం గ్రహిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. శుక్ర, శనివారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. కొన్ని విషయాలు చూసీచూడనట్టుగా వదిలివేయండి. వ్యాపకాలు అధికమవుతాయి. పత్రాలు, రెన్యువల్‌లో మెళకువ వహించండి. అయినవారి సంప్రదింపులకు అనుకూలం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. సంతానం చదువులపై దృష్టిపెడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
ప్రతికూలతలు అధికం. ధననష్టం. ప్రశాంత లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆలోచనలు చికాకు పరుస్తాయి. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. ఆప్తులు సాయం అందిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ, అధికం. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక సంఘటన తీవ్ర ప్రభావం చూపుతుంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నోటీసులు అందుకుంటారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. సరకు నిల్వలో జాగ్రత్త. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. యత్నాలు విరమించుకోవద్దు. మీ సమర్థత ఇతరులకు కలిసివస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. ప్రముఖుల కలయిక వల్ల ప్రయోజనం శూన్యం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలు సాగక విసుగు చెందుతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సంతానం దూకుడు అదుపు చేయండి. కోర్టు వాయిదాలు నిరుత్సాహరుస్తాయి. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
సర్వత్రా అనుకూలతలున్నాయి. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ఖర్చులు అదుపులో ఉండవు. ధనమూలక సమస్యలెదురవుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. వాయిదాపడిన పనులు పూర్తికాగలవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. గురు, శుక్రవారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. పిల్లల ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, అధికం. అధికారులకు హోదా మార్పు, అదనపు బాధ్యతలు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమనస్కంగా గడుపుతారు. ఖర్చులు సామాన్యం. కావలసిన వ్యక్తుల కలయిక వీలుడపదు. శనివారం నాడు పనులు సాగక విసుగు చెందుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ఒత్తిడి, పనిభారం. సంతానం యోగక్షేమాలు తెలుసుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
లావాదేవీలు చురుకుగా సాగుతాయి. రుణ విముక్తులవుతారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు సానుకూలమవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అయినవారి ప్రోత్సాహం ఉంది. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఆది, సోమవారాల్లో ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
మీ ఓర్పునకు పరీక్షా సమయం. వాగ్వాదాలకు దిగవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. కొందరి మాటతీరు మనస్తాపం కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సంతాన విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కొంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. గురు, శుక్రవారాల్లో ఒత్తిడి, ఆందోళన అధికం. నోటీసులు అందుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రియతముల క్షేమం తెలుసుకుంటారు. దంపతుల మధ్య దాపరికం తగదు. పరిచయాలు బలపడతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వద్దు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు పర్యటనలతో తీరక ఉండదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆర్థికాభివృద్ధి. పత్రాల రెన్యువల్‌లో మెలగువ వహించండి. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. ఆలోచనల్లో మార్పులు వస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆదోళన సద్దుమణుగుతుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పరిచయాలు విస్తరిస్తాయి. పదవులు, సభ్యత్వాలు యత్నాలు సాగిస్తారు. అపరిచితులతో జాగ్రత్త. శనివారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి విసుగు కలిగిస్తుంది. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. పత్రాలు సమయానికి కనిపించవు. చీటికి మాటికి అసహనం చెందుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరకు నిల్వలో జాగ్రత్త. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. సాధ్యంకాని హామీలు ఇవ్వొద్దు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. ఖర్చులు విపరీతం. డబ్బులు ఇబ్బంది ఉండదు. ఆప్తులను సాయం అందిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాలు రాణింపు, అనుభవం గడిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ప్రయాణం తలెపడతారు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
ఈ వారం అనుకూలతలున్నాయి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. దంపతుల మధ్య అవగాహనం నెలకొంటుంది. సంతానం చదువులపై దృష్టిపెడతారు. ప్రతి వ్యవహారంలో స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాల్లో ఒడిదుడుకులకు ధీటుగా ఎదుర్కొంటారు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలకు ప్రశాంతంగా సాగుతాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతారు. ఉత్సాహంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ధనలాభం ఉంది. అవసరాలు నెరవేరుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. అపరిచితులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య అవగాహనం నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు బేరీజువేసుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు.