గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 24 జూన్ 2019 (18:17 IST)

23-06-2019 నుంచి 29-06-2019 వరకు మీ వార రాశిఫలాలు(వీడియో)

మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ వారం ఆశాజనకమే. ధనలాభం ఉంది. పొదుపు పథకాలు లాభిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వ్యవహారాల్లో మీదే పైచేయి. సమస్యలను ధీటుగా ఎదుర్కొంటారు. సమర్థతను చాటుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. అతిగా ఆలోచన చేయవద్దు. మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. ప్రియతములను కలుసుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాలను నమ్మొద్దు. ఉద్యోగులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. వేడుకల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు.
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహమార్పు కలసివస్తుంది. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. డబ్బుకు ఇబ్బంది ఉండదు. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. బంధుమిత్రులు ధనసహాయం అర్థిస్తారు. పెద్ద మొత్తం సాయం శ్రేయస్కరం కాదు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ప్రముఖుల సందర్శనం కోసం నిరీక్షణ తప్పదు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరువుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. రుణ బాధలు తొలగి కుదుటపడతారు. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. మంగళ, బుధ వ్యవహారాల్లో పట్టుదలతో శ్రమించినగాని పనులు పూర్తికావు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కనిపించకుండాపోయిన పత్రాలు, వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, అశ్లేష.
ఖర్చులు విపరీతం, అవసరాలు అతికష్టమ్మీద నెరవేరుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. సన్నిహితుల సాయం అందుతుంది. పనులు ముగింపులో మందకొడిగా సాగుతాయి. గురు, శుక్రవారాల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సోదరుల మధ్య కొత్త విషయాల ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం చదువులపై దృష్టిపెడతారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. ఆత్మీయులరాక ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు ఆందోళన అధికం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు విశ్వసించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు, వస్తువులు సంపాదిస్తారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. ఆత్మీయుల సలహా పాటించండి. శనివారం నాడు తొందపాటు నిర్ణయాలు తగవు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు తప్పవు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీ సలహా అవతలి వారికి కలిసివస్తుంది. ఖర్చులు అధికం. సంతృప్తికరం. పొదుపు ధనం అందుతుంది. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తంచేయండి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆది, సోమవారాలలో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. టెండర్లు చేజిక్కించుకుంటారు. నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. దైవ, సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. రుణ బాధలు తొలగిపోతాయి వ్యవహారానుకూలత ఉంది. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. సాధ్యంకాని హామీలివ్వొద్దు. మంగళ, బుధవారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. సంతానం చదువులపై దృష్టిపెడతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. లైసెన్సుల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ప్రయాణం వాయిదాపడుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యోష్ట
ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. మనోధైర్యంతో వ్యవహరించండి. సహాయం, సలహాలు ఆశించవద్దు. గురువారం నాడు మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబ విషయాలపై దృష్టిపెడతారు. గృహంలో మార్పులకు అనుకూలం. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం. 
పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యవహారానుకూలత తక్కువే. మీ సమర్థత ఎదుటివారికి కలిసివస్తుంది. శుక్ర, శనివారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలువదు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఊహించని సంఘటనలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాఢ 2 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
పదవుల సభ్యత్వాలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. బాధ్యతగా వ్యవహించాలి. తొందరపడి హమీలివ్వొద్దు. గృహం సందడిగా ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనుల ముగింపు దశలో అస్తవ్యవస్తంగా సాగుతాయి. ఆది, సోమవారాల్లో సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఆరోగ్యం స్థిరంగా ఉటుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి నష్టాలు భర్తీ చేసుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం.. వాయిదాపడిన మొక్కులు తీర్చుకుంటారు. బెట్టింగ్‌ల జోలికి పోవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
ఆలోచనలు కార్యరూపందాల్చుతాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు భారమనిపించవు. పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. విహహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. మంగళ, బుధవారాల్లో ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సంతాన విదేశీ చదువులపై దృష్టిపెడతారు. విద్యాప్రకటనలు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. దంపతుల మధ్య దాపరికాలు తగవు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు, విశ్రాంతి తప్పవు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సంస్థల స్థాపనకు అనుకూలం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు అధికారులకు స్థానచలనం. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. ఎదుటివారి తీరును గమనించి మెలగడి. వాగ్వాదాలకు పోవద్దు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ధనలాభం, వాహన యోగం పొందుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. పనులు సానుకూలమవుతాయి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. సందేశాలు, ప్రకటనలు విశ్వసించవద్దు. గురు, ఆదివారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం. స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు.