సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శనివారం, 24 ఫిబ్రవరి 2018 (15:15 IST)

ఈ వారం మీ రాశి ఫలితాలు... 25-02-2018 నుంచి 03-03-2018 వరకు...

కర్కాటకంలో రాహువు, తులలో బృహస్పతి, వృశ్చికంలో కుజుడు, ధనస్సులో శని, మకరంలో రవి, బుధ,శుక్రులు. మిథున, కర్కాటక, సింహ, కన్యలలో చంద్రుడు, 2న శుక్రుడు, 3న బుధుడు మీన ప్రవేశం. 26న సర్వ ఏకాదశి. ముఖ్యమైన పనులకు విదియ శనివారం అనుకూలదాయకం.

కర్కాటకంలో రాహువు, తులలో బృహస్పతి, వృశ్చికంలో కుజుడు, ధనస్సులో శని, మకరంలో రవి, బుధ,శుక్రులు. మిథున, కర్కాటక, సింహ, కన్యలలో చంద్రుడు, 2న శుక్రుడు, 3న బుధుడు మీన ప్రవేశం. 26న సర్వ ఏకాదశి. ముఖ్యమైన పనులకు విదియ శనివారం అనుకూలదాయకం. 
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
సంతోషకరమైన వార్తలు వింటారు. ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. పెద్దమొత్తం సాయం క్షేమం కాదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఒక వ్యవహారంలో జోక్యం చేసుకుంటారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. పెట్టుబడులు, నూతన వ్యాపారులకు అనుకూలం. అకౌంట్స్, కంప్యూటర్, ట్రాన్స్‌పోర్ట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
ఈ వారం ఖర్చులు అంచనాలను మించుతాయి. అదనపు రాబడిపై దృష్టి పెడతారు. ప్రియతముల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. పంతాలు, భేషజాలకు పోవద్దు. లౌక్యంగా వ్యవహరించాలి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. నిరుద్యోగుల ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. వృత్తుల వారికి పురోభివృద్ధి.  
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. కుటుంబసౌఖ్యం, ధనలాభం, మానసిక ప్రశాంతత పొందుతారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పనులు చురుకుగా సాగుతాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఫోన్ సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆత్మీయుల ఆరోగ్యం కుదుటపడుతుంది. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష  
కుటుంబ విషయాలపై శ్రద్ధ అవసరం. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వ్యవహారాల్లో ప్రతికూలతలు, చికాకులు ఎదుర్కొంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆది, సోమవారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సన్నిహితుల సాయం అందుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు, పత్రాలు బయటపడతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు విపరీతం. అదనపు రాబడిపై దృష్టి సారిస్తారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు నిదానంగా ఫలిస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు నిర్లక్ష్యం తగదు. అధికారుల తీరును గమనించి మెలగండి. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. పనుల్లో ఆటంకాలెదురైనా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. మంగళ, బుధవారాల్లో ఊహించని సమస్యలెదురవుతాయి. మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సంతానం చదువులపై శ్రద్ధ అవసరం. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి. సహోద్యోగుల సాయం అందుతుంది. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. సాంకేతిక, అకౌంట్స్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2, 3 పాదాలు 
ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. రుణ ఒత్తిడి తొలగి కుదుటపడతారు. మీ కృషి ఫలిస్తుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. వివాహ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యవహారాలు, పనులు స్వయంగా చూసుకోవాలి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి తగదు. గురు, శుక్రవారాల్లో కొంతమంది మీ వైఖరిని తప్పుపడతారు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. పొదుపు పథకాలు, పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాగ్ధాటితో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉన్నత పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఖర్చులు పెరిగినా వెసులుబాటు ఉంటుంది. స్థోమతకు మించి హామీలివ్వవద్దు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. శనివారం నాడు విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ప్రకటనలు, ఫోన్ సందేశాల పట్ల అవగాహన ప్రధానం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్ద సంస్థలతో భాగస్వామ్యం అనుకూలిస్తుంది. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికం. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
వివాహయత్నాలు ముమ్మరంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ ఆశయానికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ మాటకు స్పందన లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆది, సోమవారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు పూర్తికావస్తాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. టెండర్లు, ఏజెన్సీలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం.
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. అనాలోచిత నిర్ణయాలు తగవు. కుటుంబీకుల సలహా పాటించండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం కాదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. మంగళ, బుధవారాల్లో ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వేడుకలు, తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అన్ని రంగాల వారికి ఆశాజనకమే. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. వేడుకలను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు అప్పగించవద్దు. ఆది, గురువారాల్లో ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. ఆరోగ్యం జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు కొత్త అనుభూతినిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం  గడిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వివాదాలు కొలిక్కివస్తాయి. సన్మాన, సాహిత్య సభల్లో ప్రముఖంగా పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
శుభకార్యానికి యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆహ్వానాలు, నోటీసులు అందుకుంటారు. మంగళ, శనివారాల్లో పరిచయస్తుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలకు ధీటుగా స్పందిస్తారు. ఖర్చులు పెరిగినా వెసులుబాటు ఉంటుంది. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. అకౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. జూదాలు, బెట్టింగ్‌ల జోలికి పోవద్దు. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి  
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువనివ్వండి. పంతాలు, భేషజాలకు పోవద్దు. ఆర్థిక ఒడిదుడుకులను అధిగమిస్తారు. కొంత మొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. గురు, శుక్రవారాల్లో ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. కుటుంబీకుల ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెట్టుబడులకు అనుకూలం. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను అధిగమిస్తారు. ప్రయాణం తలపెడతారు.