గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (13:06 IST)

అక్షయ తృతీయ రోజున చెరుకు రసం దానం చేస్తే?

Akshaya Tritiya
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథిని అక్షయ తృతీయ పండుగగా జరుపుకుంటారు. ఏప్రిల్ 22, శనివారం రోజున అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ రోజున పరశురాముడి జయంతిని జరుపుకుంటారు.  
 
శాస్త్రాల ప్రకారం వైశాఖ మాసం విష్ణుపూజకు అనుకూలమైన సమయం. పురాణాల ప్రకారం హయగ్రీవ, పరశురాముడిని పూజించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. త్రేతా యుగం కూడా ఈ పవిత్రమైన రోజున ప్రారంభమవుతుందని భావిస్తారు. 
 
ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అక్షయ తృతీయ నాడు ఏదైనా వస్తువులను దానం చేయడం వల్ల ఏర్పడే ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.. 
 
ఈ రోజున ముఖ్యంగా బార్లీ, గోధుమలు, శనగలు, పెరుగు అన్నం, చెరుకు రసం, పాల ఉత్పత్తులు, తీపి పదార్థాలు, బంగారం, నీటితో నిండిన కలశం, ధాన్యాలు దానం చేయడం వంటివి చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.