శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (22:57 IST)

ప్రదోషంలో శివుడి పూజతో ఏంటి లాభం?

Lord shiva
ప్రదోష సమయాల్లో, ఆలయ ప్రాకారంలో పరమేశ్వరుడి ఉత్సవమూర్తిని ఊరేగిస్తారు. ఈ ఉత్సవ మూర్తినే ప్రదోష నాయకుడని పిలుస్తారు. ప్రదోషకాలం అనేది సూర్యాస్తమయం సమయంలో ఏర్పడుతుంది. 
 
సాయంత్రం 4.30 గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ సమయం వుంటుంది. ఈ కాలంలో శివుని పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. ఎలాంటి దోషాలు లేని ఈ సమయంలో శివపూజ చేయడం అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. 
 
బుధవారం వచ్చే ప్రదోషం (ఫిబ్రవరి 7, 2024) రోజున చేసే పూజలు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తాయి. ప్రదోష కాలంలో నీలకంఠుడిని పూజించడం వలన సకల దోషాలు తొలగిపోతాయి. 
 
అలాగే ప్రదోష కాలంలో ఉపవాసం ఉండి శివాలయాల్లో జరిగే నంది అభిషేక ఆరాధన, ఈశ్వర పూజలో పాల్గొంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా ఆలయాల్లో లేదా ఇంట ప్రదోష కాలాన నమశ్శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మోక్షం సిద్ధిస్తుంది.