పసుపు పొడితోనే ముగ్గులేయాలా? ఎందుకు? (video)  
                                       
                  
				  				   
				   
                  				  ముగ్గులు వేస్తున్నారా? అయితే ఈ పద్ధతులను ఆచరించండి.. అంటున్నారు.. ఆధ్యాత్మిక నిపుణులు. సూర్యోదయానికి ముందే ఇంటి ముందు రంగవల్లికలు లేదా ముగ్గులు వేయడం చేయాలి. పేడతో అలికి వాకిట ముగ్గేయడం చేస్తే.. విష్ణువుకు ప్రీతికరం.
	
				  
	
ముగ్గుల పిండి తెలుపు రంగులో బియ్యం పిండితో వుంటే సృష్టికర్త బ్రహ్మకు మహాప్రీతి. అలాగే ఎరుపు రంగుతో కూడిన రంగులను అద్దడం ద్వారా పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
				  											
																													
									  
	 
	సూర్యోదయానికి కంటే ముందు పూజగదికి ముందు, వాకిట్లో బియ్యం పిండితో ముగ్గులు వేయడం మంచిది. అయితే పూజగది ముందు వేసే ముగ్గులకు, వాకిట్లో వేసే ముగ్గులకు తేడా వుండాలి.
				  ముగ్గుల ప్రారంభం, ముగింపు పైవైపుకే వుండాలి. చూపుడు వేలును ఉపయోగించకుండా.. ముగ్గులేయడం చేయాలి. కుడిచేతితోనే ముగ్గులు వేయాలి. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఎడమచేతితో ముగ్గులు వేయకూడదు. కూర్చుని ముగ్గులేయడం చేయకూడదు. వంగినట్లు ముగ్గులేయడం చేస్తుండాలి. దక్షిణ దిశ వైపు ముగ్గులేయడం చేయకూడదు. ఇక దైవాంశ యంత్రాలుగా పేర్కొనబడే హృదయ తామర, ఐశ్వర్య ముగ్గు, శ్రీ చక్రం ముగ్గు, నవగ్రహ ముగ్గులు వంటి పూజ గదిలో మాత్రమే వేయాలి. 
				   
				  
	 
	ఈ ముగ్గులను బియ్యంపిండి లేదంటే పసుపు పొడితో వేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అమావాస్య అలాగే పితృతర్పణాలిచ్చే రోజుల్లో ఇంటి ముందు ముగ్గులను వేయకూడదు.