Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శని..శని..శని అని పిలువకూడదు... శనీశ్వరుడు అనే పిలవాలి.. ఎందుకు?

గురువారం, 11 మే 2017 (14:36 IST)

Widgets Magazine

శనీశ్వరుడి ప్రభావం వద్దే వద్దు అనుకునే వారే అధికంగా ఉంటారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనే ఈ పేర్లు వింటేనే చాలామంది వణికి పోతారు. కానీ శనీశ్వరుడు ఇచ్చే విశేషాలను గురించి తెలుసుకుంటే.. శనిప్రభావంతో ఏర్పడే నష్టాలను చూసి జడుసుకోం. శనీశ్వరుడిని ఆరాధిస్తాం. అదెలాగంటే? ''నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం'' అంటారు. 
 
నీలాంజనం- అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడని, రవిపుత్రం అంటే.. సూర్యుని పుత్రుడని, యమాగ్రజం-అంటే యమునికి సోదరుడని, ఛాయా మార్తాండ  సంభూతం- ఛాయాదేవికి మార్తాండుడికి అంటే సూర్యునికి జన్మించిన వాడైన శనీకి నమస్కరిస్తున్నానని అర్థం. ఈ శ్లోకాన్ని స్మరిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శనీశ్వరుడిని మనం ఎప్పుడు శని శని శని అని పిలవకూడదు. "శనీశ్వరుడు" అని మాత్రమే అనాలి. 
 
ఈశ్వర శబ్ధం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. శివుడిని ఈశ్వరుడు అంటాం. మహేశ్వరుడు అని కూడా అంటాం. అలాగే వేంకటేశ్వర స్వామి వారి పేరులో కూడా వెంకట ఈశ్వరుడు అని వుంది. ఈశ్వర శబ్ధం ఉండబట్టే వెంకన్న కలియుగ దైవంగా మారాడు. కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడు. అలాగే శనినామధేయంలోనూ ఈశ్వరుడు (శనీశ్వరుడు) అనే శబ్ధం రావడంతో శనీశ్వరుడు కూడా శివునిలా, వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని విశ్వాసం. శనీశ్వరుడంటే భయపడాల్సిన అవసరం లేదు. 
 
నవగ్రహాలను పూజించేటప్పుడు శనీశ్వరుడిని భక్తిగా నమస్కరించుకుంటే సరిపోతుంది. అలాగే ఆయనకు నీలం రంగు, నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించడం.. శనీశ్వరునికి ప్రీతికరమైన చిమ్మిలి నివేదనం చేయడం ద్వారా, శివారాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చు. తద్వారా శనిగ్రహ ప్రభావంతో ఏర్పడే దోషాలు.. యోగ ఫలితాలను ఇస్తాయి. శనీశ్వరుని ప్రభావంతో కొన్ని కష్టాలు కలిగినా.. ఆయనను పూజించడం, గౌరవించడం ద్వారా ఆయన అనుగ్రహం లభిస్తుంది. 
 
కానీ శనిప్రభావం రావాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడు మిమ్మల్ని కొద్దిగా పీడించాంటే దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించి వెళ్తాడు. శనీశ్వరుడి  ప్రభావం వద్దనుకుంటే.. యోగం, ఐశ్వర్యం కూడా వద్దనుకోవాల్సిందే. శనీశ్వరుడిని చక్కగా నీలిరంగు పుష్పాలతో అలంకరణ చేయించి.. పూజించండి. శివారాధన చేయాలి. హనుమంతారాధన, అయ్యప్ప స్వామి ఆరాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Saniswara Saturday Venkateswara Maheshwara Lord Shiva Shani Dev

Loading comments ...

భవిష్యవాణి

news

జీతం రాగానే.. ఏం చేయాలంటే..? శుక్రవారం పూట ఉప్పు కొనాలట..

మీకు నెల జీతం అందగానే వెంట వెంటనే ఖర్చు పెట్టేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. జీతం చేతికి ...

news

భర్త తాగి వచ్చి హింస పెడుతుంటే ఇలా చేస్తే వదిలిపోతుంది...

భర్త తాగి వచ్చి హింస పెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత ఒక చిన్న స్పూన్ అంటే సుమారు ...

news

మీ బెడ్‌ను ఇతరులు షేర్ చేసుకుంటున్నారా? ఇతరుల దుస్తులు వాడితే ఏమౌతుందో తెలుసా?

స్నేహితులు, సన్నిహితులు, బంధువుల నుంచి ఏది పడితే అవి తీసుకుంటున్నారా? డబ్బు, వస్తువులు, ...

news

పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే?

పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఆయన్ని స్మరిస్తే.. సకల ...

Widgets Magazine