1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (12:15 IST)

గంట శబ్ధం ఎంత దూరం వినిపిస్తుందో.. దుష్ట శక్తులు..?

మనం నిత్యం పూజ చేసేటప్పుడు గంటను తప్పనిసరిగా ఉపయోగిస్తాం. అయితే గంటను శబ్ధం చేస్తూ పూజ చేయడం వెనుక గల ఆంతర్యమేమిటో కొందరికే తెలిసివుండొచ్చు. అదేంటంటే... గంట శబ్దం ఎంత దూరం వరకైతే వినిపిస్తుందో, అంతదూరం వరకూ దుష్ట శక్తులు ప్రవేశించలేవని పురాణాలు చెబుతున్నాయి.
 
ఈ కారణంగానే ప్రతి దేవాలయంలోను గంటలు వరుసగా వేళ్లాడదీసి కనిపిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ... తిరిగి వెళుతున్నప్పుడు మాత్రమే గంటను మోగించాలనే నియమం ఉంది. గంట శబ్దం శుభాన్ని సూచిస్తుంది. 
 
గంట మోగించడం వలన వచ్చే ధ్వని తరంగాలు ఆధ్యాత్మిక భావాలను మోసుకొస్తాయి ... మానసిక రుగ్మతలను దూరంచేస్తూ ప్రశాంతతను ప్రసాదిస్తాయి. 
 
ఇక పూజా మందిరాల్లో చిన్నగంటలను ఉపయోగిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. పూజలో దైవ చిహ్నంగల గంటను మాత్రమే ఉపయోగించాలని శాస్త్రం చెబుతోంది. ఒక్కో దైవ చిహ్నం కలిగిన గంటను మోగించడం వలన ఒక్కో ఫలితం ఉంటుంది. అలాగే గంటను ఇష్టానుసారంగా ... గందరగోళంగా కాకుండా లయబద్ధంగా మోగించాలి.
 
ముఖ్యంగా ధూప .. దీప .. నైవేద్యాల సమయంలోను, హారతినిచ్చే సమయంలోను గంటను తప్పనిసరిగా మోగించాలి. ఈ విధమైన నియమాలను పాటిస్తూ గంటను మోగించడం వలన పూజకి సంబంధించిన ఫలితం పరిపూర్ణంగా పొందడం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.